https://oktelugu.com/

Bigg Boss Telugu 8: పని చెయ్యని ప్రాంతీయ వాదం..టైటిల్ గెలవడానికి నిఖిల్ అగ్ని పరీక్షనే ఎదురుకున్నాడు!

ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ బిగ్ బాస్ షో లో ప్రాంతీయ వాదం సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో నడిచిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇది వరకు నలుగురు కంటెస్టెంట్స్ కలిసి ఆడితే గ్రూప్ గేమ్స్ అనే వాళ్ళు, అంత వరకు బాగానే ఉంది. కానీ ఈ సీజన్ లో మాత్రం కొంతమంది హద్దులు దాటేసారు.

Written By:
  • Vicky
  • , Updated On : December 16, 2024 / 12:09 AM IST
    Follow us on

    Bigg Boss 8 Finale : ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ బిగ్ బాస్ షో లో ప్రాంతీయ వాదం సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో నడిచిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇది వరకు నలుగురు కంటెస్టెంట్స్ కలిసి ఆడితే గ్రూప్ గేమ్స్ అనే వాళ్ళు, అంత వరకు బాగానే ఉంది. కానీ ఈ సీజన్ లో మాత్రం కొంతమంది హద్దులు దాటేసారు. అనేక రివ్యూయర్స్ కూడా తెలుగు, కన్నడ అంటూ విభజించి మన తెలుగు ఆడియన్స్ ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసారు. కానీ అవేమి పని చెయ్యలేదు. మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ మంచి వైపే ఉంటారని మరోసారి రుజువు అయ్యింది. మన జనాలు ఒక్కసారి అభిమానిస్తే ప్రాంతం, బాషా చూడరు అనడానికి ఇదే నిదర్శనం. నిఖిల్ ఎదురుకున్నని సవాళ్లు బిగ్ బాస్ హిస్టరీ లో ఎవ్వరూ ఎదురుకోలేదు. సీజన్ మొత్తం నిఖిల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని జనాల్లో బాగా రుద్దారు.

    నిఖిల్ ఫేస్ కి మాస్క్ వేసుకొని ఆడుతున్నాడు. అతని నిజస్వరూపం ఇది కాదు అంటూ స్వయంగా ఆయన మాజీ ప్రేయసి చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ కూడా నిఖిల్ విన్నింగ్ పై ప్రభావం చూపలేకపోయింది. గౌతమ్ తో గొడవ పడినప్పుడల్లా, ఈ కన్నడ వాళ్లకు తెలుగోళ్లు అంటే కడుపుమంట, గౌతమ్ పై నిఖిల్ అసూయ తో రగిలిపోతున్నాడు, ఇలా సోషల్ మీడియా లో ఎన్నో వేల కామెంట్స్ చూసి చూసి విసుగెత్తిపోయాం, కానీ జనాలు వీటిని పట్టించుకోలేదని మరోసారి నిరూపితమైంది. ఇవన్నీ సరిపోవు అన్నట్టు యష్మీ, సోనియా, సీత వంటి వారు నిఖిల్ వెంటపడ్డారు. ఇది ఆయన గేమ్ పై ప్రభావం చూపిస్తుందేమో అని అనుకున్నారు. కానీ చూపించలేదు, నిఖిల్ మీద అక్కసుతో సీత వంటి వారు అతను ఆడ పిల్లలను తమ గేమ్ కోసం వాడుకుంటున్నాడు వంటి అత్యంత నీచమైన నిందలు వేశారు. వీటికి నిఖిల్ ఎమోషనల్ గా బాగా డౌన్ అయ్యాడు.

    తనపై వేసిన నిందలు తీసుకోలేక, షో నుండి వెళ్లిపోవాలని అనుకున్నాడు. కానీ తనకి ఓట్లు వేసిన జనాల కోసం అన్నిటిని దిగమింగుకొని గేమ్ ఆడాడు. ఈ సీజన్ లో ఆయన 100 టాస్కులు ఆడితే, అందులో 97 గెలిచాడు. ఓడిపోయిన ఆ మూడు కూడా కేవలం అతని బొటన వేలుకి దెబ్బ తగలడం వల్ల మాత్రమే ఓడిపోయాడు. ఇక వ్యక్తిత్వం విషయానికి వస్తే నిఖిల్ లో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు ఏ కంటెస్టెంట్ లో కూడా లేవు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తనపై ఎన్ని నిందలు వేసినా నోరు జారలేదు, స్నేహం కోసం ఎంతో విలువ ఇచ్చాడు. శత్రువులని కూడా ఆయన తన మిత్రులుగా మార్చేసుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే నిఖిల్ ది జెంటిల్ మ్యాన్ అనడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇలా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ ని అనుభవించి నేడు ఆయన టైటిల్ విజేతగా నిలిచాడు.