https://oktelugu.com/

పాపం తెలుగు బ్యూటీకి అప్పుడే ఎదురుదెబ్బ !

పాపం చాందిని చౌదరి హీరోయిన్ గా చాలా కాలంగా నటిస్తోన్నా.. ఈ బ్యూటీకి ఇంకా హీరోయిన్ గా మాత్రం గుర్తింపు అయితే దక్కలేదు. సినిమాలు చేస్తోంది కానీ, ఇప్పటికీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. అయితే ఆమె నటించిన సినిమాల్లో కాస్త పేరు వచ్చిన సినిమా అంటే.. ఈ మధ్య వచ్చిన “కలర్ ఫోటో” సినిమానే. ఈ సినిమా డైరెక్ట్ గా డిజిటల్ ఆప్ లో రిలీజ్ అయి.. నెటిజన్లను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా చాందిని చౌదరికి […]

Written By:
  • admin
  • , Updated On : December 3, 2020 / 07:56 PM IST
    Follow us on


    పాపం చాందిని చౌదరి హీరోయిన్ గా చాలా కాలంగా నటిస్తోన్నా.. ఈ బ్యూటీకి ఇంకా హీరోయిన్ గా మాత్రం గుర్తింపు అయితే దక్కలేదు. సినిమాలు చేస్తోంది కానీ, ఇప్పటికీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. అయితే ఆమె నటించిన సినిమాల్లో కాస్త పేరు వచ్చిన సినిమా అంటే.. ఈ మధ్య వచ్చిన “కలర్ ఫోటో” సినిమానే. ఈ సినిమా డైరెక్ట్ గా డిజిటల్ ఆప్ లో రిలీజ్ అయి.. నెటిజన్లను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా చాందిని చౌదరికి మంచి పేరు వచ్చింది.

    Also Read: ‘రాంగ్ గోపాల్ వర్మ’ మూవీ ఎలా ఉందంటే..?

    అందుకే వచ్చిన ఆ నేమ్ ను, ఆ ఊపును అలానే కంటిన్యూ చేయాలని ప్రయత్నిస్తోంది చాందిని చౌదరి. ఈ క్రమంలో కొన్ని ఆఫర్లు కూడా వచ్చాయి ఈ బ్యూటీకి. ఐతే, చాందినికి ఎదురుదెబ్బ తగిలింది. ఆమె నటించిన మరో మూవీ… “బొంబాట్” అనే సినిమా తాజాగా అమెజాన్లో విడుదలైంది. ఈ సినిమాలో నటించినందుకు చాందినికి పెద్ద దెబ్బే తగిలేలా ఉంది. ఈ సినిమా చూసిన వారంతా పెదవి విరుస్తున్నారు. ఇలాంటి సినిమాని అమెజాన్ లాంటి ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఎలా రిలీజ్ అయిందా అంటూ మొత్తానికి బాగా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

    Also Read: పవన్, మహేష్ కలిస్తే.. బాక్సాఫీస్ బద్దలే !

    సోషల్ మీడియా కామెంట్స్ ని బట్టి ఈ సినిమా ఎంత దరిద్రంగా ఉందో అర్థమవుతోంది. సినిమా బ్యాడ్ అంటే పర్వాలేదు. కానీ, చాందిని నటన, ఎక్స్ ప్రెషన్లు కూడా వరెస్ట్ అంటున్నారు. నిజానికి చాందిని మంచి నటినే. మరి ఎందుకు ఇంత దారుణంగా నటించింది. దర్శకుడు సైన్స్ ఫిక్షన్ పేరుతో హింస పెట్టాడనేది క్రిటిక్స్ చెబుతున్న మాట. మొత్తానికి ఈ సినిమా దెబ్బతో చాందినికి ఉన్న పేరు మొత్తం పోయేలా ఉంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్