
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి.. ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన ఆరా, జన్‌కీ బాత్ సంస్థలు తెరాసకు మెజార్టీ స్థానాలు వస్తాయని పేర్కొన్నాయి.ఆరా సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. తెరాసకు 71-85 స్థానాలు (40.08 శాతం ఓట్లు), ఏఐఎంఐఎం 36-46 స్థానాలు (13.43 శాతం), భాజపా 23-33 స్థానాలు (31.21 శాతం), కాంగ్రెస్ 0-6 స్థానాలు (8.58 శాతం) కైవసం చేసుకోనున్నాయి. ఆరా ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా తెరాస, భాజపా మధ్య 9 శాతం ఓట్ల వ్యత్యాసం కనపడుతోంది. ఇతరులకు 7.70 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. మరో సంస్థ జన్‌కీ బాత్ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌లోనూ తెరాస అధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెరాసకు 67-77 స్థానాలు (37.4 శాతం ఓట్లు), ఏఐఎంఐఎం 39-43 స్థానాలు (21 శాతం), భాజపా 24-42 స్థానాలు (33.60 శాతం), ఇతరులు 2 నుంచి 5 స్థానాలు కైవసం చేసుకోనున్నట్లు వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి 4.2 శాతం ఓట్లు సాధించేందుకు అవకాశం ఉన్నట్లు వివరించింది.