https://oktelugu.com/

అసెంబ్లీమే సవాల్.. జగన్ పై తొడగొట్టిన బాబు!

ఏడు పదుల వయసులో.. అదీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయిన చంద్రబాబుకు బీపీ పెంచేస్తున్నారు ఏపీ సీఎం జగన్. పాపం ముసలాయాన అని కూడా వదిలేయకుండా ఆయనతో స్పీకర్ పోడియం ఎక్కించేలా చేస్తున్నారు. జగన్ దెబ్బకు రోజుకో బీపీ టాబ్లెట్ కూడా బాబు గారు వేసుకుంటున్నా కంట్రోల్ కావడం లేదో ఏమో మరీ.. వరుసగా జగన్ ను చంద్రబాబు తిట్టిపోస్తున్నాడు. Also Read: రేవంత్ రెడ్డికే టీపీసీసీ.. ముహుర్తం ఖరారైందా? నిన్న జగన్ ను పట్టుకొని ‘గాడు-గీడు’ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 3, 2020 / 07:55 PM IST
    Follow us on

    ఏడు పదుల వయసులో.. అదీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయిన చంద్రబాబుకు బీపీ పెంచేస్తున్నారు ఏపీ సీఎం జగన్. పాపం ముసలాయాన అని కూడా వదిలేయకుండా ఆయనతో స్పీకర్ పోడియం ఎక్కించేలా చేస్తున్నారు. జగన్ దెబ్బకు రోజుకో బీపీ టాబ్లెట్ కూడా బాబు గారు వేసుకుంటున్నా కంట్రోల్ కావడం లేదో ఏమో మరీ.. వరుసగా జగన్ ను చంద్రబాబు తిట్టిపోస్తున్నాడు.

    Also Read: రేవంత్ రెడ్డికే టీపీసీసీ.. ముహుర్తం ఖరారైందా?

    నిన్న జగన్ ను పట్టుకొని ‘గాడు-గీడు’ అంటూ నోరుజారిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేదు. జగన్ జీరో సీఎం అని.. అసలు సీఎంకు ఉండాల్సిన లక్షణాలు జగన్ కు లేవని విమర్శలు గుప్పించారు. విపక్షాల గొంతు నొక్కేస్తున్నాడని.. ఫేక్ మీడియా ఫేక్ వార్తలు ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారా? అని ప్రశ్నించారు.

    వాస్తవాలు చెబితే అచ్చెన్నాయుడిపై 10 మంది ఎదురుదాడి చేశారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ వాళ్లు అసెంబ్లీకి రాకూడదని కుట్ర పన్నుతున్నారన్నారని ఆరోపించారు. ‘అసెంబ్లీ మీ తాత జాగీరా’ అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో అధికార పక్షం డ్రామాలు ఆడుతోందని చంద్రబాబు ఆగ్రహించారు.

    Also Read: కేసీఆర్ ఇచ్చాడు.. నువ్వు ఎందుకు ఇవ్వవు జగన్: పవన్

    టీడీపీ సానుభూతిపరులకు పింఛన్లు కట్ చేశారని.. ఈ ఏడాది ఇవ్వాల్సిన పింఛన్ ను వచ్చే ఏడాది ఇస్తామంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ హయాలో 50.29 లక్షల మందికి పింఛన్ ఇచ్చామని.. తక్కువ ఇచ్చామని అసెంబ్లీలో మాపై బురద జల్లుతున్నారని ఆరోపించారు.

    అసెంబ్లీలో కూర్చొని భజన చేస్తారా? విశాఖలో విజయసాయిరెడ్డి పెత్తనం ఏంటి? అంటూ చంద్రబాబు నిలదీశారు. ఏకపక్షంగా అసెంబ్లీని నడుపుకుంటారా? నడుపండి చూద్దాం.. మాకు ప్రత్యామ్మాయాలు ఉన్నాయని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్