ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి క్రికెట్ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సి పనిలేదు. మైదానంలో తన ఆటతో కోట్లాది మంది ఫ్యాన్స్ ను ఆకట్టుకున్న డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలోనూ అభిమానులను అలరిస్తున్నాడు. నిత్యం తనకు సంబంధించిన పిక్స్.. వీడియోలనూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటూ మరింత క్రేజ్ ను పెంచుకుంటున్నాడు.
Also Read: రాజకీయాల్లోకి రీఎంట్రీపై బండ్ల గణేష్ క్లారిటీ
నిత్యం క్రికెట్ మ్యాచులతో బీజీగా గడిపే క్రికెటర్లకు అనుకోనివిధంగా కరోనా.. లాక్డౌన్ టైంలో కలిసొచ్చింది. ఈ సమయంలోనే కొందరు క్రికెటర్లు తనలోని సృజనాత్మకతను బయటపెట్టారు. వీరిలో డేవిడ్ వార్నర్ ఒకరు. కరోనా.. లాక్డౌన్ సమయంలో డేవిడ్ వార్నర్ టిక్ టాక్ వీడియోలు చేస్తూ అభిమానులను అలరించాడు.
డేవిడ్ వార్నర్ కు ఆస్ట్రేలియాతోపాటు భారత్ లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈక్రమంలో డేవిడ్ వార్నర్ ఇండియన్ సినిమాకు సంబంధించిన సెలబ్రెటీల టిక్ టాక్ వీడియోలు చేస్తూ అలరించారు. ఆయన వీడియోలకు భారతీయుల నుంచి మంచి స్పందన లభించడంతో వార్నర్ దానిని కంటిన్యూ చేస్తూ వెళుతున్నాడు.
డేవిడ్ వార్నర్ గతంలోనే కొన్ని టిక్ టాక్ వీడియోలు చేసి అలరించాడు. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన ‘అలవైకుంఠపురములో’ మూవీలోని బుట్టబొమ్మ సాంగ్ కు ఫ్యామిలీతో కలిసి స్టెప్పులేసి అలరించాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. దీని తర్వాత దక్షిణాదికి చెందిన హీరోలను ఇమినేట్ చేస్తూ పలు వీడియోలు చేయగా వాటికి మంచి ఆదరణ లభించింది.
Also Read: ‘ఆదిపురుష్’: ప్రభాస్ పారితోషికం.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్..!
ఈ సమయంలోనే ఐపీఎల్ రావడంతో డేవిడ్ వార్నర్ బీజీగా మారాడు. ఇక ఐపీఎల్ ముగియడంతో డేవిడ్ వార్నర్ తాజాగా ఓ వీడియోను ఇన్ స్ట్రాగ్రాంలో విడుదల చేశాడు. ఇందులో బిగ్ బీ అమితాబ్ లా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రామ్ లా కన్పించి అభిమానులకు త్రిపుల్ ధమాకా ఇచ్చాడు.
‘ఇస్మార్ట్ శంకర్’లో రామ్.. ‘అరవిందసమేత’లో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్.. బిగ్‌బీ అమితాబ్ లుక్స్‌లో ఉంటాడనేది మార్ఫింగ్ చేసి షేర్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్స్ తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్