Anupama Parameswaran: గత ఏడాది టాలీవుడ్ కి అన్న సీజన్ గా పరిగణించే ఫిబ్రవరి నెలలో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించిన చిత్రం ‘డీజే టిల్లు’. టైటిల్ సాంగ్ పెద్ద హిట్ అవ్వడం, ట్రైలర్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉండడం తో ఈ సినిమాకి విడుదల ముందు నుండి భారీ హైప్ ఉండేది. దానికి తగ్గట్టుగానే కంటెంట్ కూడా ఉండడం తో ఓపెనింగ్స్ అదిరిపోయాయి.
అలా కేవలం 7 కోట్ల రూపాయిల బాక్స్ ఆఫీస్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం, ఫుల్ రన్ లో 18 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. అంటే పెట్టిన ప్రతీ పైసాకి మూడింతలు లాభం అన్నమాట. అంత పెద్ద హిట్ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రాబోతుంది.ఈ సినిమా సెప్టెంబర్ నెలలో గణేష్ చతుర్థి ని పురస్కరించుకొని విడుదల చేయబోతున్నట్టు నిన్న అధికారిక ప్రకటన చేసారు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. కార్ లో హీరో సిద్దు జొన్నలగడ్డ ని అనుపమ హాగ్ చేసుకుంటున్న ఫోటో ని విడుదల చేసారు. ఈ ఫోటో చూసిన తర్వాత ప్రతీ ఒక్కరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఏమిటంటే, ఇందులో అనుపమ పరమేశ్వరన్ విచ్చలవిడిగా రొమాంటిక్ సన్నివేసాలి నటించిందని. ఇది వరకు ఆమె చేసిన సినిమాలలో ‘రౌడీ బాయ్స్’ అనే చిత్రం లో తప్ప ఎక్కడ కూడా రొమాంటిక్ సన్నివేశాల్లో హద్దులు దాడిమరీ నటించలేదు. కానీ ఈ సినిమాలో హద్దులే ఉండవని తెలుస్తుంది. ఇక మొదటి భాగం లో హీరోయిన్ రాధికా పాత్ర ని బాగా నెగటివ్ గా చూపిస్తారు.
ఇక రెండవ భాగం లో అనుపమ పారేశ్వరం క్యారక్టర్ ని మరింత నెగటివ్ గా చూపించబోతున్నారట. పూర్తి స్థాయి నెగటివ్ రోల్ లో నటించాలని ఉందని ఎప్పుడూ కోరుకునే అనుపమ పరమేశ్వరన్, తాను కోరుకున్న పాత్ర లభించడం వల్లే, రొమాంటిక్ సన్నివేశాలు బాగా ఉన్నప్పటికీ పెద్ద గా పట్టించుకోలేదని తెలుస్తుంది.మరి ఈ పూర్తి స్థాయి నెగటివ్ రోల్ లో అనుపమ పరమేశ్వరన్ ఆడియన్స్ ని మెప్పిస్తుందో లేదో చూడాలి.