Bichagadu 2 Collections: 2016 వ సంవత్సరంలో అతి చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన చిత్రం ‘బిచ్చగాడు’. ఈ సినిమా అప్పట్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ సినిమాకి పోటీగా విడుదలై ఆ సినిమాకంటే ఎక్కువ వసూళ్లను సాధించింది. కేవలం తెలుగు రాష్ట్రాలు మరియు తమిళ నాడు ప్రాంతం నుండి క్లోసింగ్ లో పాతిక కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ సినిమా, టీఆర్ఫీ రేటింగ్స్ విషయం లో కూడా అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది.
ఈ సినిమా కి విజయ్ ఆంటోనీ అంటే తెలుగు వాళ్ళకే కాదు, తమిళ వాళ్లకు కూడా పూర్తిగా తెలియదు. కానీ ఎప్పుడైతే ఈ చిత్రం విడుదలై సూపర్ హిట్ అయ్యిందో, ఆయనకి తెలుగు మరియు తమిళం బాషలలో స్థిరమైన మార్కెట్ ఏర్పడింది. అలాంటి సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ గా ఆయన ‘బిచ్చగాడు 2 ‘ అనే చిత్రం తీసాడు.
నిన్ననే ఈ చిత్రం గ్రాండ్ గా తెలుగు మరియు తమిళం బాషలలో విడుదలై యావరేజి టాక్ ని తెచ్చుకుంది.యావరేజి టాక్ వచ్చినప్పటికీ కూడా ఓపెనింగ్స్ విషయం లో దుమ్ము లేపేసింది ఈ చిత్రం. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం లో ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ కలెక్షన్స్ థియేటర్స్ కళకళలాడిపోయాయి. ‘దసరా’ మరియు ‘విరూపాక్ష’ చిత్రాల తర్వాత సమ్మర్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది.
ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు కేవలం తెలుగు రాష్ట్రాల నుండే రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట.ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ అవ్వాలంటే 6 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా స్టడీ కలెక్షన్స్ ని మైంటైన్ చేస్తే బ్రేక్ ఈవెన్ చాలా తేలికగా అయిపోతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు, చూడాలి మరి.