PKSDT Bro Movie Story: పవన్ కళ్యాణ్ ‘బ్రో’ మూవీ ఫుల్ స్టోరీ ఇదే.. సరిగ్గా తీస్తే ఒక్క రికార్డు కూడా మిగలదు!

చిత్రం జులై 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుందని మేకర్స్ షూటింగ్ ప్రారంభం రోజే ప్రకటించేసారు.

Written By: Vicky, Updated On : May 20, 2023 9:15 am

PKSDT Bro Movie Story

Follow us on

PKSDT Bro Movie Story: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న నాలుగు సినిమాలలో షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం గా ఉన్న చిత్రం ‘బ్రో’.నిన్ననే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని విడుదల చెయ్యగా దానికి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు.

ఈ చిత్రం జులై 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుందని మేకర్స్ షూటింగ్ ప్రారంభం రోజే ప్రకటించేసారు. ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు.’విరూపాక్ష’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ మరియు కేతిక శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన పూర్తి స్టోరీ సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారింది. ఇందులో పవన్ కళ్యాణ్ టైం గాడ్ గా నటించాడు అనే విషయం మోషన్ పోస్టర్ చూసినప్పుడే అర్థం అయిపోయింది.కథ విషయానికి వస్తే ఎంతో సంతోషంగా సాఫ్ట్ వేర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ , తన కుటుంబానికి మొత్తం పెద్ద దిక్కు గా ఉండే వ్యక్తి మార్కండేయ( సాయి ధరమ్ తేజ్). అతను చేస్తున్న ఉద్యోగం లో ఉన్నత స్థాయికి వెళ్లే క్రమం లో రోడ్డు ప్రమాదం లో అతను మరణిస్తాడు. అప్పుడు అతని ఆత్మని పరలోకానికి తీసుకెళ్లడానికి టైం గాడ్(పవన్ కళ్యాణ్) వస్తాడు. తనకి జీవితం లో ఎన్నో బాధ్యతలు ఉన్నాయని, ఇలాంటి సమయం లో నేను చనిపోతే నా కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందని, దయచేసి కొంతకాలం జీవితం ఇవ్వాలని టైం గాడ్ ని ప్రాధేయ పడుతాడు మార్కండేయ.

అప్పుడు టైం గాడ్ అతనికి మూడు నెలల సమయం ఇచ్చి, అతనితో పాటుగా మార్కండేయ ఇంటికి వెళ్తాడు.ఈ మూడు నెలల్లో మార్కండేయ తన బాధ్యతలను మొత్తం పూర్తి చేసుకుంటాడా లేదా అనేదే స్టోరీ. పవన్ కళ్యాణ్ మార్క్ కామెడీ టైమింగ్ తో ఈ చిత్రం సాగిపోతూనే మధ్యలో ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే విధంగా ఉంటాయట. సరైన టేకింగ్ తో ఈ చిత్రాన్ని తీస్తే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు అవ్వడం ఖాయం.