Prabhas Project K Records: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటిస్తున్న చిత్రాలలో అభిమానులతో పాటుగా ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్ K’. మహానటి తర్వాత ‘నాగ అశ్విన్’ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ సుమారుగా 500 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్ కి జోడిగా దీపికా పాడుకొనే నటించగా, అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్ర పోషించాడు.
ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సీనియామని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికీ కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రాని ఈ సినిమాకి అప్పుడే మార్కెట్ లో క్రేజీ బిజినెస్ మొదలైంది. ఇదంతా ప్రభాస్ ఊర మాస్ క్రేజ్ కి నిదర్శనం అంటున్నారు ట్రేడ్ పండితులు.
వాళ్ళ లెక్క ప్రకారం ఈ చిత్రం నైజాం ప్రాంత ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగిపోయిందట. నైజాం ప్రాంతం లో పేరు మోసిన డిస్ట్రిబ్యూటర్, ఆసియన్ చైన్స్ అధినేత సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని 72 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇప్పటి వరకు #RRR చిత్రానికి తప్ప ఏ సినిమాకి కూడా ఈ రేంజ్ బిజినెస్ లేదు. డైరెక్టర్ కూడా రాజమౌళి రేంజ్ ఏమి కాదు, కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న వ్యక్తి. అలాంటి డైరెక్టర్ ని పెట్టుకొని ఈ రేంజ్ బిజినెస్ జరిగిందంటే ప్రభాస్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.ఈ రేంజ్ బిజినెస్ జరగడానికి కూడా ఒక కారణం ఉంది.
ప్రభాస్ గత రెండు చిత్రాలు డిజాస్టర్ టాక్ తెచుకున్నవే, వాటిల్లో ‘సాహూ’ చిత్రానికి ఈ ప్రాంతం లో 32 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా ‘రాధే శ్యామ్’ చిత్రానికి పార్థి కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఫ్లాప్ సినిమాలకే అలా ఉంటే, హిట్ సినిమా పడినప్పుడు ప్రభాస్ కి ఈ ప్రాంతం లో ఏ రేంజ్ వసూళ్లు వస్తాయో ఊహించుకోవచ్చు. అందుకే బయ్యర్స్ కళ్ళు మూసుకొని 72 కోట్ల రూపాయలకు కొనేసుకున్నారు.