spot_img
Homeఎంటర్టైన్మెంట్హిందీలో భాగమతి రీమేక్ అవుతోంది

హిందీలో భాగమతి రీమేక్ అవుతోంది

స్వీటీ శెట్టి అలియాస్ అనుష్కప్రధాన పాత్రలో వచ్చిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ‘భాగమతి’ తెలుగులో అద్భుత విజయం సాధించింది. ఊపిరి సలపని సప్సెన్స్ మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్నివిపరీతంగా భయపెట్టింది. సూపర్ హిట్ అయ్యింది. హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. పిల్ల జమిందార్ ఫేమ్ దర్శకుడు అశోక్ ఈ సినిమాని ఓ భిన్నమైన కథాంశంతో హారర్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కించి మెప్పించాడు. కాగా ఈ సినిమా ఇపుడు బాలీవుడ్ లో రీమేక్ కాబోతుంది. హిందీలో “దుర్గావతి” పేరు తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో , హీరోయిన్ గా టాయిలెట్ మూవీ ఫేమ్ భూమి పెడ్నేకర్ నటిస్తోంది. తెలుగులో అనుష్క పోషించిన “భాగమతి “పాత్రని ఏనాడైనా శైలిలో మెప్పించ బోతోంది.

బాలీవుడ్ కి చెందిన విక్రమ్ మల్హోత్రా నిర్మాతగా నిర్మించబడుతోన్న ఈ ‘దుర్గావతి’ చిత్రాన్ని తెలుగులో డైరెక్ట్ చేసిన అశోకే డైరెక్ట్ చేయబోతున్నాడు.ఇంకో విశేషం ఏమిటంటే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. దాంతో హిందీలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. మరి అనుష్క ‘భాగమతి’ ‘దుర్గావతి’గా హిందీ ప్రేక్షకులను అలరిస్తోందా లేదా అంటే మరికొద్ది రోజులు ఆగాలి . కరోనా విపత్తు తగ్గితే గాని సినీ పరిశ్రమ లో షూటింగ్ షెడ్యూల్ లాంటివి బయటికి రావు .
Good movies have its own reputation

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version