మేము సైతం అంటున్న చిత్ర పరిశ్రమ

కరోనా వైరస్ మహమ్మారి అనేక రంగాలతో పాటు చిత్ర పరిశ్రమను కూడా తీవ్రంగా దెబ్బతీసింది. ముఖ్యంగా సినీ రంగం పై ఆధారపడిన చాలా మంది ప్రత్యక్షంగా, కొందరు పరోక్షంగా ఉపాధి కోల్పోయారు. కొత్త చిత్రాల షూటింగ్స్, మరియు విడుదల నిలిపివేయడం వలన అనేక మంది ఆర్థికంగా నష్టపోయారు . ఉపాధి లేకపోవడం వలన కొందరు నిత్యవసర వస్తువులు కూడా కొనుక్కోలేని దుస్థితి దాపురించింది . దీనితో తమ వంతు సాయంగా తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ […]

Written By: admin, Updated On : March 26, 2020 6:03 pm
Follow us on

కరోనా వైరస్ మహమ్మారి అనేక రంగాలతో పాటు చిత్ర పరిశ్రమను కూడా తీవ్రంగా దెబ్బతీసింది. ముఖ్యంగా సినీ రంగం పై ఆధారపడిన చాలా మంది ప్రత్యక్షంగా, కొందరు పరోక్షంగా ఉపాధి కోల్పోయారు. కొత్త చిత్రాల షూటింగ్స్, మరియు విడుదల నిలిపివేయడం వలన అనేక మంది ఆర్థికంగా నష్టపోయారు . ఉపాధి లేకపోవడం వలన కొందరు నిత్యవసర వస్తువులు కూడా కొనుక్కోలేని దుస్థితి దాపురించింది . దీనితో తమ వంతు సాయంగా తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ ముందుకు వచ్చారు.

ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ, నిత్యావసర వస్తువులను కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్న సినీ వర్గాలకు అండగా నిలవాలని తెలుగు దర్శకుల సంఘం నిర్ణయించుకుంది. అలాగే వారి వివరాలను కూడా సేకరిస్తోంది. . ఏప్రిల్ మొదటి వారం నుండే ఈ సేవలు అందించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్. శంకర్ అధికారిక ప్రకటన చేయడం జరిగింది.

ప్రముఖ దర్శక రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ కరోనా భాదితుల సహాయ నిధికి తన వంతుగా 20 లక్షలు ఇవ్వడానికి సిద్ద మయ్యాడు. అలాగే మరో దర్శకుడు అనిల్ రావిపూడి కూడా తన వంతుగా పది లక్షల విరాళాన్ని ప్రకటించాడు. ఇక ప్రముఖ దర్శకుడు వి వి వినాయక్ కూడా 20 లక్షలు సాయం చేయడానికి రెడీ అయ్యాడు. అంతకు ముందు సినీ కార్మికులు బాధలో ఉన్నారని తెలిసి 5 లక్షలు విలువైన నిత్యావసరాలు ఇవ్వడం జరిగింది. ఇపుడు మళ్ళీ ఇరవై లక్షలు ఇవ్వబోతున్నాడు. ఇపుడు తాజాగా మరో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కూడా తనవంతు గా రెండు రాష్ట్రాలకు 5 లక్షలు చొప్పున వితరణ చేయ బోతున్నాడు.

అదలా ఉంటే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తెలుగు ప్రజలకు ఓ విన్నపం చేస్తున్నాడు. కరోనా వైరస్ అనేది చాలా ప్రమాదకరం .ఆ విషయం ప్రపంచ దేశాల పరిస్థితి చూస్తుంటే అర్థం అవుతుంది. ఊహకు మించిన ప్రమాదం దీని నుండి పొంచి వుంది. ఈ తరుణంలో ప్రజలందరూ ప్రభుత్వ సిబ్బందికి మరీ ముఖ్యంగా పోలీసులకు సహకరించాలని కోరుతున్నాడు. కరోనా వైరస్ పై చేసే యుద్ధంలో మనమంతా బాధ్యత గల పౌరులుగా మెలగాలని సూచించారు .