Bhola Shankar : ఏడాది ప్రారంభంలో చరిత్ర తిరగరాసే బ్లాక్ బస్టర్ తో మెగాస్టార్ చిరంజీవి మెగా ఫ్యాన్స్ లో నింపిన జోష్ మామూలుది కాదు..రీ ఎంట్రీ ఖైదీ నెంబర్ 150 ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో, ‘వాల్తేరు వీరయ్య’ అంతకు మించి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుంది..సాధారణంగా సంక్రాంతి తర్వాత సినిమాలు బాగా స్లో అవుతాయి అని ట్రేడ్ లో మాట్లాడుకుంటూ ఉంటారు.

కానీ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా మాత్రం ‘తగ్గేదే లే’ అనే విధంగా బాక్స్ ఆఫీస్ ని దంచికొడుతూనే ఉంది..ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా కోసం కదులుతున్నట్టు ఈమధ్య కాలం లో ఏ స్టార్ హీరో సినిమాకి కూడా కదలలేదు అనే చెప్పాలి..నేటి తరం యువత కి మెగాస్టార్ హిట్ కొడితే ఇలా ఉంటుందా అని అర్థం అయ్యేలా చేసింది ఈ చిత్రం.
అయితే ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బస్టర్ ని ఎంజాయ్ చేస్తున్న మెగాస్టార్ ఫ్యాన్స్ కి ఆ తర్వాతి సినిమా ‘భోళా శంకర్’ ని చూసి భయపడిపోతున్నారు..ఎందుకంటే ఈ సినిమాకి దర్శకుడు మెహర్ రమేష్..ఇతని కెరీర్ లో రీసౌండ్ వచ్చే రేంజ్ హిట్ ఒక్కటి కూడా లేదు..ప్రభాస్ తో తీసిన బిల్లా సినిమా ఒక్కటి యావరేజి గా ఆడింది..మిగిలిన సినిమాలన్నీ ఫ్లాప్స్ గా నిలిచాయి..అందులోనూ ఇప్పుడు చేస్తున్న సినిమా డైరెక్ట్ తెలుగు సినిమా కాదు..తమిళం లో ఆరేళ్ళ క్రితం విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన అజిత్ ‘వేదలమ్’ మూవీ కి రీమేక్..రీమేక్ సినిమాలు ఇప్పుడు ఎలా ఆడుతున్నాయి మన కళ్లారా చూసాము..’గాడ్ ఫాదర్’ చిత్రమే అందుకు ఉదాహరణ..ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ లాంటి హిట్ తర్వాత మళ్ళీ ఫ్లాప్ ని చూసేందుకు ఇష్టపడడం లేదు ఫ్యాన్స్.
అందుకే ఈ సినిమాని డైరెక్టుగా ఓటీటీ కి ఇచ్చేయమని సోషల్ మీడియా ఒత్తిడి చేస్తున్నారు..మెగాస్టార్ కూడా ఔట్పుట్ సరిగా రాకపోతే ఫాన్సీ రేట్ కి డైరెక్ట్ ఓటీటీ కి ఇచ్చేయమని మేకర్స్ కి చెప్పాడట..ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది..మరి ఈ సినిమా థియేటర్స్ లో వస్తుందా లేదా డైరెక్టు గా ఓటీటీ లో విడుదల అవుతుందా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.