Bhola Shankar Box Office collections : వాల్తేరు వీరయ్య మూవీతో బాక్సాఫీస్ షేక్ చేసిన చిరంజీవి… భోళా శంకర్ విషయంలో తడబడ్డాడు. ఈ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఆశించిన స్థాయిలో సత్తా చాటడం లేదు. భోళా శంకర్ మొదటి షో నుండే నెగిటివ్ టాక్ మూటగట్టుకోగా వసూళ్లు అలానే ఉన్నాయి. భోళా శంకర్ రెండో రోజు మరింత నెమ్మదించింది. ఫస్ట్ డేతో పోల్చుకుంటే 70% శాతం మేర వసూళ్లు పడిపోయాయి. మొదటి రోజు భోళా శంకర్ ఏపీ/తెలంగాణ రాష్ట్రాల్లో రూ. 14.25 కోట్ల షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్ ఇది రూ. 16.5 కోట్లుగా ఉంది.
ఇక రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో భోళా శంకర్ రూ. 3.50 నుండి 4.50 కోట్ల మధ్య వసూలు చేసింది. వరల్డ్ వైడ్ రూ. 5.50 నుండి 6.50 కోట్లు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అనే రెండు రోజుల్లో భోళా శంకర్ షేర్ రూ. 20 కోట్లు మాత్రమే. భోళా శంకర్ ప్రీ రిలీజ్ బిజినెస్ తో పోల్చుకుంటే బ్రేక్ ఈవెన్ కావడానికి చాలా కావాలి. లేటెస్ట్ ట్రెండ్ చూస్తుంటే భోళా శంకర్ రికవరీ కావడం కష్టమే. అయితే లాంగ్ వీకెండ్ ఉంది. సోమవారం ఒక్కరోజే వర్కింగ్ డే. మంగళవారం ఇండిపెండెన్స్ డే.
జైలర్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో భోళా శంకర్ గట్టి పోటీ ఎదుర్కొంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా జైలర్ వసూళ్లు మెరుగ్గా ఉన్నాయి. భోళా శంకర్ నైజాం రూ. 22 కోట్ల ప్రీ రిలీజ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో బోళా శంకర్ రూ. 67.6 కోట్ల మేర ప్రీ రిలీజ్ జరిగింది. వరల్డ్ వైడ్ రూ. 80 కోట్ల వరకు భోళా శంకర్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. భోళా శంకర్ రూ. 81 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగింది.
భోళా శంకర్ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకుడు. 2015లో విడుదలైన తమిళ చిత్రం వేదాళం రీమేక్ గా తెరకెక్కింది. చిరంజీవికి జంటగా తమన్నా నటించింది. ఇక కీలకమైన చెల్లి పాత్రలో కీర్తి సురేష్ నటించారు. ఆగస్టు 11న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. ఏ కే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర భోళా శంకర్ చిత్రాన్ని నిర్మించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.