Bandi Sanjay: అసమ్మతి సెగలు ఒక కాంగ్రెస్ లోనే కాదు బీజేపీలోనూ ఎగసిపడుతున్నాయి. కాంగ్రెస్ లో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అసమ్మతి కుంపటి రాజేయగా వీహెచ్ తోడయ్యారు. దీంతో అధిష్టానం కలుగజేసకుని పరిస్థితులు చక్కదిద్దే వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో బీజేపీలో అసమ్మతి వర్గం బయలుదేరింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరుపై విమర్శలు చేస్తున్నారు. ఇందులో కూడా సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని అక్కసు వెళ్లగక్కుతున్నారు. దీంతో పార్టీలో వ్యతిరేక వర్గం తయారు కావడంతో పార్టీలో చర్చనీయాంశం అవుతోంది.
కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన కొందరు నేతలు బండి సంజయ్ ఒంటెత్తు పోకడ పోతున్నారని విమర్శలు చేస్తున్నారు. పార్టీలో సీనియర్లను లెక్క చేయకుండా పోతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. దీంతో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనా రెడ్డి పరిస్థితిని చక్కదిద్దాలని చూస్తున్నా వారు వినడం లేదు. ఫలితంగా సంజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే కుదరదని తెగేసి చెబుతున్నారు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నామని మమ్మల్ని ఖాతరు చేయడం లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు,
Also Read: ‘భీమ్లానాయక్’ విడుదలయ్యే దాకా ‘జగన్’ సినిమా టికెట్ రేట్స్ పెంచడా?
దీనిపై బండి సంజయ్ కూడా ధీటుగానే స్పందిస్తున్నారు. పార్టీని ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో అందరు కలిసి రావాలే తప్ప కలుపుకుపోవడం వీలు కాదని చెబుతున్నారు. పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి అందరు పని చేయాల్సిందేనని స్పందిస్తున్నారు. ఎవరో ఒకరి కోసం పార్టీ నిర్ణయాలు ఉండవని పార్టీ సిద్ధాంతాలకు లోబడి అందరు కష్టపడాల్సిందేనని చెప్పడం గమనార్హం. దీంతో బీజేపీలో కూడా లుకలుకలు మొదలయ్యాయనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.
మరోవైపు రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న క్రమంలో ఇలాంటి వాటిని పట్టించుకోవడం కుదరదని తెలుస్తోంది. పార్టీని ఇప్పటికే చాలా ముందుకు తీసుకెళ్లామని అందరు కలసి వస్తే రావాలి లేదంటే వారి దారి వారు చూసుకోవాల్సిందేననే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది. దీంతో సీనియర్లయినా జూనియర్లయినా ఎవరైనా పార్టీ విధేయత కోసం పని చేయాలని సూచిస్తున్నారు.
టీఆర్ఎస్ కు కూడా బీజేపీ భయం పట్టుకుంది. అందుకే పార్టీని బలోపేతం కానీయకుండా ఇలాంటి లోపాయకారి ఒప్పందాలతో విచ్చిన్నం చేయడానికి ప్రయత్నిస్తోందనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా అందరు ఐక్యంగా పోరాడాలని పిలుపునిస్తున్నారు.
మరోసారి నరేంద్ర మోడీ ప్రధానిగా చూడాలన్నదే బీజేపీ అభిమతంగా చూడాలని భావిస్తున్నారు. ఇందుకోసమే 2024 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగాలని చెబుతున్నారు. దీని కోసమే అందరరం సమష్టిగా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. బీజేపీ ఎదుగుదలకు అడ్డంకులు కల్పించొద్దని ప్రాధేయపడుతన్నారు. భవిష్యత్ లో పార్టీని విజయతీరాలకు చేర్చడమే ప్రధాన లక్ష్యంగా తీసుకుంటోంది. ఇందుకు గాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
Also Read: ఉదయ్ కిరణ్ మీద అప్పట్లో ఎన్ని పుకార్లు వచ్చాయో తెలుసా..?