Pushpa First Review: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప. ఈ సినిమా రిలీజ్‌కు ఇంకొక్కరోజే మిగిలింది. డిసెంబరు 17న అంటే రేపే ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్, పాటలు నెట్టింట వైరల్‌గా మారాయి. ట్రైలర్ చూసినవాళ్లంతా సినిమా పక్కా సూపర్‌హిట్ అంటూ ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు. పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా.. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే.

First Review #Pushpa from Overseas Censor Borad ! #PushpaTheRise is a turning point in his career [personally as well as professionally]. Fantabulous — that's the right word to describe him work this time. His fans will go gaga over his new Avatar. ⭐⭐⭐⭐ pic.twitter.com/cdIn7BM8Ya
— Umair Sandhu (@UmairSandu) December 15, 2021
అయితే, తాజాగా, ఈ సినిమా తొలి రివ్యూ వచ్చేసింది. యూఏఈ ఓవర్సీస్ సెన్సార్ బోర్డులో సభ్యుడిగా ఉన్న ఉమైర్ సంధూ ఈ సినిమాను చూసిన అనుభవాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ క్రమంలోనే పుష్ప ఫస్ట్ రివ్యూని సోష్మీడియాలో పోస్ట్ చేశారు.
Also Read: పుష్ప కోసం వెయిటింగ్ అంటున్న విజయ్ దేవరకొండ… అల్లు అర్జున్ స్వీట్ రిప్లై
సెన్సార్ బోర్డులో సినిమా ప్రదర్శన ముగిసిందని.. పుష్ప మొదటి సగం టెర్రిఫిక్.. బన్నీ, రష్మిక కెమిస్ట్రీ వేరే లెవెల్.. వాట్ ఎ ఫర్మార్మెన్స్ అంటూ చెప్పుకొచ్చారు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, సుకుమార్ దర్శకత్వం అన్నీ సినిమాను వేరే లెవెల్‌కు తీసుకెళ్లాయని టాలీవుడ్లో ఇప్పటి వరకు వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో పుష్ప ఒకటని కొనియాడారు. అల్లు అర్జున్‌కు ది బెస్ట్ కెరీర్ మూవీగా పేర్కొంటూ.. నేషనల్ అవార్డు వచ్చేలా నటించారని అన్నారు. ఈ క్రమంలోనే సినిమారు 4/5 రేటింగ్ ఇచ్చారు.
పుష్ప సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పుష్ప ది రైజ్ పేరుతో తొలి భాగాన్ని విడుదల చేస్తోంది చిత్రబృందం. ఈ సినిమాతోనే బన్నీ అఫిషియల్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. మరి థియేటర్లలో ప్రేక్షకులు ఏమంటారో చూడాలి.
Also Read: పుష్ప మూవీ టీమ్ కి ఊహించని షాక్… సెన్సార్ కష్టాలు తప్పేనా
