https://oktelugu.com/

Bheemla Nayak In Bollywood: బాలీవుడ్‌లో భీమ్లానాయ‌క్ రిలీజ్ డేట్ ఫిక్స్‌.. ఆ కార‌ణం వ‌ల్లే లేట్ అయిందంట‌

Bheemla Nayak In Bollywood:  ఒక‌ప్పుడు తెలుగు సినిమాలు ఇక్క‌డ మాత్ర‌మే ఆడేవి. కానీ ఇప్పుడు మార్కెట్ బాగా పెరిగిపోయింది. ఇత‌ర భాష‌ల్లో కూడా మ‌న తెలుగు హీరోల సినిమాల‌కు మంచి క్రేజ్ ఉంటోంది. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ ఒక్క‌డే ఇత‌ర భాషల్లో ముఖ్యంగా బాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. కానీ మేమెలా అనుకున్న వారికి పుష్ప దారి చూపించాడు. పుష్ప మూవీ త‌ర్వాత తెలుగు హీరోల మూవీల‌కు బాలీవుడ్ లో అమాంతం క్రేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు ప‌వ‌న్ […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 1, 2022 / 01:25 PM IST

    Bheemla Nayak Box Office Collections

    Follow us on

    Bheemla Nayak In Bollywood:  ఒక‌ప్పుడు తెలుగు సినిమాలు ఇక్క‌డ మాత్ర‌మే ఆడేవి. కానీ ఇప్పుడు మార్కెట్ బాగా పెరిగిపోయింది. ఇత‌ర భాష‌ల్లో కూడా మ‌న తెలుగు హీరోల సినిమాల‌కు మంచి క్రేజ్ ఉంటోంది. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ ఒక్క‌డే ఇత‌ర భాషల్లో ముఖ్యంగా బాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. కానీ మేమెలా అనుకున్న వారికి పుష్ప దారి చూపించాడు. పుష్ప మూవీ త‌ర్వాత తెలుగు హీరోల మూవీల‌కు బాలీవుడ్ లో అమాంతం క్రేజ్ పెరిగిపోయింది.

    Bheemla Nayak In Bollywood

    ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఇదే బాట‌లో కొనసాగుతున్నాడు. తెలుగులో ఈ మూవీ సూప‌ర్ హిట్ అయింది. కేవ‌లం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్కును అందుకుంది. బ్లాక్ బ‌స్ట‌ర్ దిశ‌గా దూసుకుపోతోంది. అయితే ఇప్పుడు ఈ మార్కెట్‌ను క్యాచ్ చేసుకోవాలని ప్రొడ్యూస‌ర్లు భావిస్తున్నారు. దీంతో బాలీవుడ్ మీద ఫోక‌స్ పెట్టారు.

    Also Read:  బాక్సాఫీస్ వద్ద రఫ్ఫాడిస్తున్న భీమ్లానాయక్

    బాలీవుడ్ లో ఈ మూవీని రిలీజ్ చేయ‌డానికి రెండు కార‌ణాలు ఉన్నాయి. అక్క‌డ ప‌వ‌న్‌కు మంచి గుర్తింపు ఉంది. ఇంకో బ‌ల‌మైన కార‌ణం రానా. రానా గ‌తంలో బాహుబ‌లితో పాటు ఆ త‌ర్వాత కొన్ని బాలీవుడ్ లో సినిమాలు చేసి అక్క‌డ క్రేజ్ తెచ్చుకున్నాడు. అత‌ను అక్క‌డ సుప‌రిచితుడు. కాబ‌ట్టి అక్క‌డ కూడా ఈ మూవీని రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారు.

    Bheemla Nayak In Bollywood

    అయితే ఇక్క‌డ రిలీజ్ చేసిన‌ప్పుడే అటే ఫిబ్ర‌వ‌రి 25నే రిలీజ్ చేయాల‌ని అంతా భావించారు. కానీ డ‌బ్బింగ్ ఆల‌స్యం కావ‌డంతో వారం రోజులు లేటుగా వ‌స్తోంది. మార్చి 4న ఈ మూవీని బాలీవుడ్ లో రిలీజ్ చేసేందుకు ఫిక్స్ చేశారు. మ‌రి తెలుగులో అయిన‌ట్టే బాలీవుడ్ లో కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొడుతుందా లేదా అన్న‌ది చూడాలి. ఇంత రియ‌ల‌స్టిక్ స్టోరీ బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవుతుందో లేదో అనే అనుమానాలు అభిమానుల్లో ఉన్నాయి. చూడాలి మ‌రి భీమ్లానాయ‌క్ ఎలాంటి మాయ చేస్తుందో.

    Also Read:  సిగ‌రెట్ తాగుతూ తేజ‌స్వి, ముమైత్ అరాచ‌కం.. బ్యాంకాక్ బీచ్‌లో అలా అంటూ..!

    Tags