Russia-Ukraine conflict: ముందు నుయ్యి వెనుక గొయ్యి అంటే ఇదేనేమో. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తోంటే ప్రపంచ దేశాలు రష్యా చర్యను ఖండిస్తుంటే డ్రాగన్ మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతోంది. దీంతో రష్యా చర్యను అన్ని దేశాలు ముక్త కంఠంతో ప్రశ్నిస్తుంటే చైనా మాత్రం ఏమీ అనలేకపోతోంది. ఉక్రెయిన్ కు మద్దతుగా చాలా దేశాలు మద్దతు తెలుపుతుంటే చైనా ఏ నిర్ణయం చెప్పలేకపోతోంది.
ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో వీటో తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు అందులో శాశ్వత సభ్య దేశమైన చైనా ఏ నిర్ణయం చెప్పలేక గైర్హాజరైంది. దీంతో వ్యక్తిగతంగా రష్యాకు మద్దతు ఇస్తున్నా బహిరంగంగా మాత్రం తన వైఖరి స్పష్టం చేయడం లేదు. దీంతో రష్యా విషయంలో చైనా వ్యవహారం మొదటి నుంచి అనుమానంగానే ఉంది. ఈ నేపథ్యంలో రష్యాకు రహస్యంగా బలం ఇవ్వడమే తప్ప బహిరంగంగా మాత్రం వెనకడుగు వేస్తోంది.
Also Read: ఉక్రెయిన్ యుద్ధం: రష్యా తగ్గడం లేదు..
రష్యాతో చైనాకు ఉన్న వాణిజ్య అవసరాల మేరకు అలా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రష్యా చెలరేగిపోతోంది. ఉక్రెయిన్ తో యుద్ధానికి సిద్ధమైనట్లు చెబుతున్నారు రష్యా చర్యలను అందరు విమర్శిస్తున్నా అదిలెక్క చేయడం లేదు. ఫలితంగా ఉక్రెయిన్ పై పెను ప్రభావం చూపుతోంది రష్యా తన యుద్ధ కాంక్షతో బాంబుల వర్షం కురిపిస్తోంది.
దీంతో రొద మొదలైంది. అన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రెచ్చిపోతోంది. అణ్వస్త్రాలను ప్రయోగించేందుకు సైతం సిద్ధం కావడంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిన్న జరిగిన చర్చల్లో పురోగతి లేకపోవడంతో రెండో దఫా చర్చలపై ఆశలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా ఇంకా ఏం నిర్ణయాలు తీసుకుంటుందో తెలియడం లేదు. దీనికి ఉక్రెయిన్ తీవ్రం గా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read: కాపు నాయకులపై ఎన్నో అనుమానాలు?