Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో రాబోతున్న ‘భీమ్లా నాయక్’ ఓవర్ సీస్ లోనూ భారీగా రిలీజ్ చేస్తున్నారు. యూఎస్ లో ఏకంగా 600 కి పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. కరోనా అనంతరం ఈ స్థాయిలో రిలీజ్ అవుతున్న తెలుగు సినిమా ‘భీమ్లా నాయక్’ మాత్రమే. పైగా భీమ్లా నాయక్ కోసం ఓవర్ సీస్ లోనూ భారీ హడావుడి జరుగుతుంది.

అక్కడ పవన్ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో తెలియదు గానీ, పవన్ సినిమాను చాలా సీరియస్ గా తీసుకున్నారు ఫ్యాన్స్. పైగా ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పవన్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ త్రివిక్రమ్ తో కలిసి తాను ఇటీవల భీమ్లానాయక్ రఫ్ సినిమాని చూశానని, అదిరిపోయింది అని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చెప్పాడు.
Also Read: ఐదు రాష్ట్రాల ఎన్నికలు: పంజాబ్ లో గెలుపెవరిది?
ఈ సినిమాలో పవన్ కల్యాణ్ యాక్షన్ తనకు ఎంతో నచ్చిందని, ఆయన కెరీర్ లోనే ఇది ఉత్తమ చిత్రం అవుతుందని థమన్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ‘భీమ్లా నాయక్’లో హోమ్లీ బ్యూటీ నిత్యా మీనన్, యంగ్ బ్యూటీ సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమాకు యువ దర్శకుడు సాగర్ కే. చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. అన్నట్టు ‘భీమ్లా నాయక్’ సినిమాకి రన్ టైమ్ కేవలం 2 గంటల 21 నిమిషాలు మాత్రమే. ఎందుకంటే.. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే త్రివిక్రమే. ఎంతైనా మాటల మాంత్రికుడిగా త్రివిక్రమ్ కు ప్లే మీద, మాటల మీద మంచి పట్టు ఉంది.
Also Read: హిట్ మ్యాన్ రోహిత్ నక్క తోక తొక్కాడా? ఏంటీ వైట్ వాష్ సిరీస్ గెలుపులు?