RRR: రాజమౌళి ఏ ముహూర్తాన ఆర్ ఆర్ ఆర్ ప్రకటించారో తెలియదు కానీ… మొదటి నుండి చిక్కులే. మూడేళ్లకు పైగా సాగిన షూటింగ్ లో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ వరుసగా గాయాల పాలయ్యారు. అనంతరం కరోనా కారణంగా ఏర్పడిన రెండు లాక్ డౌన్ పీరియడ్స్ వలన షూటింగ్, మరికొంత డిలే అయ్యింది. మూడు సార్లు వాయిదా పడ్డ రిలీజ్ డేట్… నిర్మాత న, డిస్ట్రిబ్యూటర్స్ నుండి ఒత్తిడి. ఇలా సవాలక్ష సమస్యలు ఆర్ ఆర్ ఆర్ మూవీ ఫేస్ చేసింది.

ఇన్ని ఇబ్బందుల నడుమ మూవీ పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేయగా మరో సవాల్ ఆర్ ఆర్ ఆర్ మూవీకి ఎదురైంది. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 7న ఆర్ ఆర్ ఆర్ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. పెద్ద పండుగకు వారం రోజుల ముందు ఆర్ ఆర్ ఆర్ విడుదల కానుంది. అయితే ఐదు రోజుల వ్యవధిలో మరో పెద్ద చిత్రం భీమ్లా నాయక్ విడుదలకు సిద్ధంగా ఉంది. భీమ్లా నాయక్ జనవరి 12న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామం ఆర్ ఆర్ ఆర్ కి ఇబ్బందిగా నిలిచింది.
దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ పెట్టుబడి తిరిగి రాబట్టాలంటే… భారీ ఓపెనింగ్స్ దక్కాలి. అలా ఓపెనింగ్ వసూళ్లు కావాలంటే అత్యధిక థియేటర్స్ లో విడుదల చేయాలి. అయితే కేవలం ఐదురోజుల తర్వాత బీమ్లా నాయక్ విడుదల ఉంది. దీని వలన చాలా థియేటర్స్ ఆర్ ఆర్ ఆర్ నిర్మాతలు కోల్పోవాల్సి ఉంటుంది. ఇది వసూళ్ల పై తీవ్ర ప్రభావం చూపుతుంది. రాధే శ్యామ్ మూవీ జనవరి 14న విడుదల అవుతుండగా… ఆర్ ఆర్ ఆర్ ఫోకస్ మొత్తం భీమ్లా నాయక్ పైనే పెట్టారు. ఎలాగైనా భీమ్లా నాయక్ నిర్మాతలను ఒప్పించి, విడుదల వాయిదా వేసుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: Television to silver screen heroes: బుల్లితెర టూ వెండితెరకు వెళ్లిన హీరోలు వీరే!
అయితే ఇప్పటి వరకు జరిగిన చర్చలు సఫలం కాలేదు. ఈ నేపథ్యంలో రాజమౌళి సెకండ్ ఆప్షన్ గా రాధే శ్యామ్ ని ఎంచుకున్నాడట. ప్రభాస్ తో రాజమౌళికి ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో రాధే శ్యామ్ విడుదల వాయిదా వేయించి… భీమ్లా నాయక్ మూవీ విడుదల తేదీ జనవరి 14, 15 తేదీలకు షిఫ్ట్ చేయాలని చూస్తున్నారట. రాధే శ్యామ్ ప్రభాస్ హోమ్ బ్యానర్ లో తెరకెక్కిన చిత్రం కాబట్టి.. పవన్ కంటే, ప్రభాస్ ని కన్విన్స్ చేయడం ఈజీ అన్న మాట వినిపిస్తోంది. ఇంకా ఆర్ ఆర్ ఆర్ విడుదలకు 50 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో… సంక్రాంతి సమరం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.
Also Read: Actress keerthi Suresh: ఆ స్పెషల్ మూవీకి ఒకే చెప్పిన కీర్తి సురేశ్… నిర్మాతలుగా నటి అమ్మానాన్నలు