Bheemla Nayak Attains Breakeven: పవన్ కల్యాణ్‌కు సరైన హిట్టు పడాలే గానీ.. కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు భీమ్లానాయక్ ఈ విషయాన్ని క్లియర్ గా చూపిస్తోంది. మొదటి నుంచి భారీ అంచనాలతో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఇందులో నటించిన పవన్, రానాలకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. అయితే మూవీ వచ్చిన తొలి మూడు రోజుల్లోనే ఏకంగా రూ.100 కోట్లు వసూలు చేసింది.

ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లోనే జరిగింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా కలిపి ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తంగా రూ.106.75 కోట్లు చేసింది. కాగా ఈ 11 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు రూ.113.60 కోట్ల గ్రాస్ సాధించింది. అలాగే రూ. 95.08 కోట్లు షేర్‌ను వసూలు చేసి దుమ్ము లేపింది. ఇక అటు ప్రపంచ వ్యాప్తంగా కలిపి రూ.154.70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ మూవీ.
Also Read: Mega Star Mammootty In Akhil Agent: ‘అఖిల్’ కోసం మెగాస్టారే దిగాడు.. వర్కౌట్ అవుతుందా ?
అయితే షేర్ పరంగా కొంచెం వెనక బడినట్టు తెలుస్తోంది భీమ్లానాయక్. వాస్తవానికి ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ మూవీ రూ.106.75 కోట్ల వరకు చేసింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ రూ. 108 కోట్లు టార్గెట్ గా పెట్టుకుంది. గడిచిన ఈ 11 రోజుల్లో రూ.106.75 కోట్లు షేర్ ను వసూలు చేసి పర్వాలేదనిపించుకుంది. కాగా ఈ మూవీ ఇంకా అనుకున్న టార్గెట్‌ను పూర్తి చేయలదు.
భీమ్లా నాయక్ లాభాల్లోకి రావాలంటే రూ.12.92కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ పవర్ స్టార్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాగూ మార్చి 12 వరకు పెద్ద సినిమాలు రావట్లేదు కాబట్టి ఈ టార్గెట్‌ను అందుకోవడం పవన్‌కు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. పైగా ఇప్పుడు వచ్చిన చిన్న సినిమాలు కూడా ప్లాప్ టాక్‌ను తెచ్చుకున్నాయి. కాబట్టి బ్రేక్ ఈవెన్‌ను సాధించడం భీమ్లానాయక్‌కు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.
Also Read: Rashmika Mandanna: ముద్దులన్నీ దానికేనా..? అల్లాడిపోతున్న రష్మిక అభిమానులు
[…] Also Read: Bheemla Nayak Attains Breakeven: బ్రేక్ ఈవెన్ కు దగ్గర ప… […]