Prabhas Comments On Rajamouli Movie: మనకు తెలిసి ఇప్పుడు ప్రభాస్ అంటే పాన్ ఇండియా స్టార్. తెలుగులో అందరి కంటే ఎక్కువ బిజినెస్ చేయగల హీరోగా కొనసాగుతున్నాడు. కానీ కెరీర్ తొలినాళ్లలో మాత్రం చాలా ఇబ్బందులు పడ్డాడు. క్రేజీ హీరో అయినా కూడా స్టార్ డమ్ మాత్రం రాలేదు. ఆయన కంటే ముందు వచ్చిన హీరోలు మాస్ ఆడియన్స్ ను సంపాదించుకున్నారు. కానీ ప్రభాస్ కు మాత్రం ఆ కల అప్పటికి నెరవేరలేదు.

ఈ సమయంలోనే రాజమౌళి వచ్చే ప్రభాస్ మార్కెట్ ను అమాంతం పెంచేశాడు. ప్రభాస్ కోరుకున్న మాస్ ఆడియన్స్ ను కూడా తెచ్చి పెట్టాడు. ఆ మూవీనే ఛత్రపతి. అయితే ఇప్పుడు ఆ మూవీ గురించి ఎందుకంటారా.. అక్కడికి వస్తున్నాము ఆగండి. ప్రస్తుతం రాదే శ్యామ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ప్రభాస్.. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి గురించి అద్భుతంగా వివరించారు.
ఛత్రపతి సినిమాలో లైన్ దాటి కాట్రాజు తో జరిగే ఫైటింగ్ ఇప్పటికీ బెస్ట్ యాక్షన్ సీన్ అనే చెప్పుకోవాలి. అయితే ఈ మూవీలో ప్రభాస్ ను కాట్రాజ్ ఓ కర్ర తో వీపుపై బలంగా కొట్టే సీన్ కూడా ఉంటుంది. ఆ కర్రను రవీందర్ రెడ్డి సముద్రంలోని ఉప్పుతో తయారు చేశారట. పైగా అచ్చం పాతకాలం నాటి కర్రలాగా ఉండేందుకు దానిపై నాచు లాంటివి వేసి నేచురల్ ఫీలింగ్ వచ్చేలా చేశారని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.

అయితే ఈ కర్రతో కాట్రాజ్ కొడితే తన వీపు పగిలిపోయింది అంటూ ప్రభాస్ రాధే శ్యామ్ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. అంటే ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి పనితనం అంత పర్ఫెక్ట్ గా ఉంటుందని చెప్పాడన్నమాట. ప్రస్తుతం రాధేశ్యాం కోసం కూడా ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి పనిచేశారట. ఆయన వేసిన సెట్లు అద్భుతంగా ఉన్నాయంటూ ప్రభాస్ మెచ్చుకున్నారు. ఇలా రవీందర్ రెడ్డి గురించి ప్రభాస్ ఎవరికీ తెలియని విషయాలను పంచుకున్నాడు.