Bhartha Mahasayulaku Wignyapthi Trailer: ఈమధ్య కాలం లో వరుసగా కమర్షియల్ సినిమాలు చేస్తూ డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకుంటున్న మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja), రూట్ మార్చి చేసిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి'(Bharta Mahasayulaku Vignapti). కిషోర్ తిరుమల దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 13 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా కాసేపటి క్రితమే ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేసి థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి ఊహించని రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. రవితేజ నుండి ఇలాంటి సినిమాని ఆడియన్స్ ఇప్పటి వరకు ఊహించలేదు. ఎంతసేపు విలన్స్ తో ఫైట్లు, నాలుగు పంచు డైలాగులు, రెండు మూడు మాస్ మసాలా పాటలు , వీటితోనే రవితేజ ఈమధ్య కాలం లో కనిపిస్తూ వచ్చాడు. ఆడియన్స్ కి ఆయన సినిమాలు అంటేనే చిరాకు వచ్చేసింది.
అందుకే ఆయన లేటెస్ట్ చిత్రం ‘మాస్ జాతర’ యావరేజ్ రేంజ్ లో ఉన్నప్పటికీ డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఈ క్రమం లో ఆయన మళ్లీ అలాంటి కమర్షియల్ జానర్ సినిమాల జోలికి పోకుండా ఇద్దరి ఆడవాళ్ళ మధ్య నలిగిపోయే కథతో మన ముందుకు రాబోతున్నాడు. ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్లు, పాటలు పర్వాలేదు అనే రేంజ్ లో ఉన్నాయి. కానీ నేడు విడుదల చేసిన ట్రైలర్ ని చూస్తుంటే ఈ సినిమా వర్కౌట్ అయ్యేలా ఉంది అనే ఫీలింగ్ ని ఆడియన్స్ లో కలిగించింది. అప్పటికే పెళ్లి అయిపోయిన ఒక వ్యక్తి, మరో అమ్మాయిని ప్రేమించడం, ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఆధారంగా ఈ చిత్రాన్ని తీసినట్టు అనిపించింది. సునీల్, సత్య, వెన్నెల కిషోర్ వంటి కమెడియన్స్ ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచినట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా కమెడియన్ సత్య కామెడీ చాలా గట్టిగానే పేలేలాగా అన్పిస్తుంది. ఇందులో ఆయన హీరోయిన్ ఆశికా రంగనాథ్ కి లైన్ వేసే క్యారెక్టర్ లో కనిపించాడు. ఆమె హై హీల్ చెప్పులు వేసుకొని నడుస్తున్న సమయం లో రోడ్డు మీద పడున్న అరటి తొక్కని తొక్కబోతుంటే, తన చెయ్యి అడ్డుపెట్టి గాయం చేసుకుంటాడు. ఎందుకిలా చేస్తున్నావ్ అని హీరోయిన్ అడగ్గా , ‘నీకు ఏమైనా జరిగితే మోస్ట్ ఎఫెక్ట్ అయ్యే పర్సన్ నేనే’ అంటూ విజయ్ దేవరకొండ స్టైల్ లో మిమిక్రీ చేస్తూ చెప్పిన డైలాగ్ బాగా హైలైట్ అయ్యింది. అదే విధంగా సునీల్ చాలా కాలం తర్వాత తన వింటేజ్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ తో కామెడీ చేసినట్టుగా అనిపించింది. సునీల్ ని ఆ యాంగిల్ లో చూస్తే ఆడియన్స్ కి విజువల్ ఫీస్ట్ అనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఈ ట్రైలర్ ని మీరు కూడా చూసేయండి.