Bharateeyudu 2: భారతీయుడు 2కి ఆ ఓటీటీ సంస్థ భారీ షాక్… నిర్మాతలను వెంటాడుతున్న కష్టాలు! ఇలా అయ్యిందేంటి?

భారతీయుడు 2 చిత్రాన్ని దర్శకుడు శంకర్ ఏ ముహూర్తాన స్టార్ట్ చేశాడో కానీ, అన్నీ సమస్యలే. తాజాగా మరో ఇబ్బంది వచ్చిపడింది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు నిర్మాతల పరిస్థితి అయ్యింది. అసలు మేటర్ ఏమిటో చూద్దాం

Written By: S Reddy, Updated On : August 1, 2024 11:12 am

Bharateeyudu 2

Follow us on

Bharateeyudu 2: 1996లో వచ్చిన భారతీయుడు ఇండస్ట్రీ హిట్. చెప్పాలంటే పాన్ ఇండియా హిట్. తమిళంలో ఇండియన్ గా విడుదలైన ఈ చిత్రం తెలుగులో భారతీయుడు, హిందీలో హిందూస్థానీ టైటిల్స్ తో విడుదల చేశారు. అన్ని భాషల్లో భారతీయుడు భారీ విజయం సాధించింది. అప్పట్లో భారతీయుడు చిత్రం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. కమల్ హాసన్ నటన, ఏ ఆర్ రెహమాన్ సాంగ్స్, శంకర్ దర్శకత్వ ప్రతిభకు జనాలు ఫిదా అయ్యారు.

Also Read: రవితేజ వదులుకున్న ఈ సినిమా ఆ యంగ్ హీరో కెరియర్ కి టర్నింగ్ పాయింట్ గా మారిందా..?

భారతీయుడు ఆల్ టైం క్లాసిక్ గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలనే ఆలోచన చేశాడు శంకర్. మొదట దిల్ రాజు వద్దకు ప్రతిపాదన వచ్చింది. భారతీయుడు 2 శంకర్-దిల్ రాజు కాంబోలో దాదాపు కన్ఫర్మ్ అయ్యింది. బడ్జెట్ లెక్కలు చూశాక కంగారు పడ్డ దిల్ రాజు పక్కకు తప్పుకున్నాడు. దాంతో లైకా ప్రొడక్షన్స్ రంగంలోకి దిగింది. 2019లో షూటింగ్ మొదలైతే 2024లో విడుదలైంది. అంటే 5 ఏళ్లకు పైగా సమయం తీసుకుంది.

భారతీయుడు 2 షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. నిర్మాతలతో శంకర్ కి విభేదాలు తలెత్తాయి. దానికి తోడు సెట్స్ లో ప్రమాదం జరిగి ప్రాణ నష్టం వాటిల్లింది. భారతీయుడు 2 ఆగిపోవడంతో కమల్ హాసన్ విక్రమ్ మూవీ చేశాడు. విక్రమ్ బ్లాక్ బస్టర్ కావడంతో… భారతీయుడు 2 నిర్మాతలకు ఆశలు కలిగాయి. భారతీయుడు 2 చిత్రాన్ని తిరిగి పట్టాలెక్కించారు. ఎట్టకేలకు పూర్తి చేసి విడుదల చేశారు.

జులై 12న పలు భాషల్లో విడుదలైన భారతీయుడు 2 నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో నిర్మాతలకు మరలా కష్టాలు మొదలయ్యాయి. భారతీయుడు 2లో ఎక్కడా శంకర్ మార్క్ కనబడలేదు. ప్రేక్షకులు నిరాశ చెందారు. నెగిటివ్ టాక్ నేపథ్యంలో త్వరగానే థియేట్రికల్ రన్ ముగిసింది. దీంతో ఓటీటీ విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ కూడా భారతీయుడు 2 చిత్రానికి చుక్కెదురైనట్లు సమాచారం.

భారతీయుడు 2 చిత్రం మీద ఉన్న హైప్ రీత్యా భారీ ధరకు డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయాయి. నెట్ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని కొనుగోలు చేసింది. తీరా విడుదలయ్యాక మూవీ ప్లాప్ అయ్యింది. దీంతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అధిక మొత్తం ఇచ్చేందుకు నెట్ఫ్లిక్స్ సిద్ధంగా లేదట. ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ ఆ మధ్య బాగా నష్టపోయాయి. భారీ చిత్రాలను పోటీపడి కొని, అవి ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో డిజిటల్ సంస్థలు నష్టాలు చవి చూడాల్సి వస్తుంది.

అందుకే నిబంధనలు మార్చారు. మూవీ విజయం సాధిస్తే ఒక రేటు, సాధించకపోతే మరొక రేటు అనే రూల్ తెచ్చాయి. అనుకున్న దాని కంటే మూవీ భారీ విజయం సాధిస్తే.. అదనంగా డబ్బులు ఇస్తాయట. లేదంటే ఒప్పందం చేసుకున్న మొత్తం కంటే తక్కువ ఇస్తాయట. ప్రస్తుతం ఈ నిబంధన భారతీయుడు 2కి వర్తించిందని అంటున్నారు.

నెగిటివ్ టాక్ తో థియేటర్స్ లో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది భారతీయుడు 2. ఏళ్ల తరబడి మూవీ నిర్మించడంతో బడ్జెట్ కూడా పెరిగింది. కనీసం డిజిటల్ రైట్స్ రూపంలో నష్టాలు తగ్గించుకోవచ్చని భారతీయుడు 2 నిర్మాతలు భావించారు. కానీ అక్కడ కూడా వాళ్లకు నిరాశ ఎదురైంది.

Also Read: నాకు నా భర్త రాజ్ తరుణ్ కావాలన్న లావణ్య.. రాజ్ తరుణ్ రియాక్షన్ వైరల్…