https://oktelugu.com/

IPL Megha Auction 2025 : ప్రీతి జింటా మాజీ లవర్ తో గొడవపడ్డ షారుఖ్ ఖాన్..కారణం ఏంటంటే..?

ప్రస్తుతం ఐపిఎల్ అనేది ఇండియన్స్ కి ఒక ఎమోషన్ గా మారిపోయింది...అందుకే ఐపిఎల్ మ్యాచ్ లా కోసం చాలా ఈగర్ గా ఎదురుచూస్తూ ఉంటారు...ఇక దానికి తగ్గట్టుగానే ఆయా టీమ్ లా ప్రాంచైజ్ లు కూడా వాళ్ల టీమ్ లను గెలిపించుకోవడానికి ట్రై చేస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : August 1, 2024 4:29 pm
    Follow us on

    IPL Megha Auction 2025  : ఇక ఐపీఎల్ ముగిసి రెండు నెలలు అవుతుందో లేదో అంతలోనే ఆయా టీమ్ లా ప్రాంచైజ్ లు నెక్స్ట్ సీజన్ కి సంబంధించిన తీవ్రమైన చర్యలను చేపడుతున్నారు. బీసీసీఐ విధించే ఆంక్షల పట్ల ఐపీఎల్ జట్ల యజమానులు కూడా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే ఈ సంవత్సరం మెగా వేలం నిర్వహించబోతున్నాం అంటూ బీసీసీఐ మొదటి నుంచి చెబుతుంది. మరి దీని మీద ఆయా టీమ్ లా యజమానులు కొద్దివరకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ ఈ సంవత్సరం మెగా వేలం ఉంటుందా? లేదా అనే దాని మీదనే ఇప్పుడు తీవ్రమైన చర్చలైతే నడుస్తున్నాయి… ఇక నిన్న ఐపిఎల్ ప్రాంఛైజ్ లు మరియు బీసీసీఐ అధికారుల మధ్య జరిగిన సమావేశంలో అనేక అంశాల గురించి చర్చించారు… ఇక కలకత్తా నైట్ రైడర్స్ టీమ్ యజమాని అయిన ‘షారుక్ ఖాన్’ కూడా మెగా వేలం విధానాన్ని వ్యతిరేకిస్తున్నాడు… అలాగే షారుక్ ఖాన్ పంజాబ్ కింగ్స్ సహా యజమాని అయిన నెస్ వాడియా తో మంతనాలను జరిపాడు. ఇక నెస్ వాడియా మెగా వేలం కు మద్దతు ఇచ్చే విధంగా కనిపిస్తున్నాడు. దీని ద్వారా షారుక్ ఖాన్ వాడియా ల మధ్య మాటలు యుద్ధం జరిగింది. ఇక ఇదిలా ఉంటే వాడియా 2005వ సంవత్సరం నుంచి 2009 వరకు ప్రీతి జింటాతో హై ప్రొఫైల్ రిలేషన్ షిప్ ను మెయింటైన్ చేశాడు.

    మొత్తానికైతే 2014 లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో వాడియా తనపై దాడికి పాల్పడ్డాడని ప్రీతి జింటా ఆరోపించిన తర్వాత ఆయన న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాడు… ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రీతిజింటా పంజాబ్ కింగ్స్ కి సహా యజమానిగా కొనసాగుతుంది…ఇక ఐపిఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పంజాబ్ టీమ్ ఒక్కసారి కూడా ట్రోఫీ గెలుచుకోలేదు…ఇక ఈ సంవత్సరం కలకత్తా నైట్ రైడర్స్ ట్రోఫీ ని దక్కించుకుంది. ఇక రాబోయే సంవత్సరం కూడా కలకత్తా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగబోతున్నారు. ఇక ఇదిలా ఉంటే వాడియా మాత్రం ఇప్పుడు మెగా వేలం వేయడానికి ముందుకు వస్తున్నాడు… మరి బీసీసీఐ మెగా వేలాన్ని నిర్వాహిస్తుందా? లేదా అనే విషయాల మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు. మూడు సంవత్సరాలకు ఒకసారి మెగా వేలం వేసే బదులు ప్రతి సంవత్సరం చిన్న వేలాన్ని వేసుకోవచ్చు కదా అంటూ కొంతమంది బీసీసీఐ కి సలహాలను ఇస్తున్నారు… ఇక ఇదిలా ఉంటే ఐపీఎల్ కి ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలామంది అభిమానులు ఉన్నారు.

    ఇక ఇప్పుడు ప్రతి ఒక్క టీం లక్ష్యం కూడా ట్రోఫీని గెలుచుకోవడమే కాబట్టి రీసెంట్ గానే ప్రతి టీం తమకు కావాల్సిన ప్లేయర్లందరిని ఏరి కోరి తీసుకున్నారు. ఇక ఇప్పుడిప్పుడే వాళ్ళను ట్రెయిన్ చేసుకుంటున్న క్రమం లో మళ్ళీ ఇప్పుడే మెగా వేలం నిర్వహించి ప్లేయర్లందరిని టీమ్ ల నుంచి బయటికి పంపించడం అనేది కొంతవరకు ఇబ్బందిని కలిగించే విషయమే అందువల్లే ఆయా టీమ్ లా ప్రాంచైజ్ లు మెగా వేలం మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. మరి దీనిమీద బీసీసీఐ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుంది అనేది ఇప్పుడు అన్ని ఐపిఎల్ టీమ్ ల్లో కూడా చర్చనీయాంశం గా మారింది…