Bhale Unnade Collection: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి కుర్ర హీరోలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజ్ తరుణ్. యూట్యూబ్ లోని షార్ట్ ఫిలిమ్స్ లో హీరో గా నటించిన రాజ్ తరుణ్, ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ లోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు. అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో తెరకెక్కిన ‘ఉయ్యాలా జంపాల’ చిత్రానికి తొలుత అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన రాజ్ తరుణ్, ఆ తర్వాత అదే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీ కి పరిచయమయ్యాడు. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడం తో రాజ్ తరుణ్ కి వరుసగా అవకాశాలు వచ్చాయి. ‘సినిమా చూపిస్తా మావ’,’కుమారి 21 F’,’ఆడో రకం ఈడో రకం’, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించిన రాజ్ తరుణ్ కి గత కొంతకాలం నుండి సరైన సూపర్ హిట్ లేదు. దానికి తోడు ఆయన రీసెంట్ గా ఒక వివాదం లో చిక్కుకున్నాడు.
ఈ వివాదం నడుస్తున్న సమయంలో రాజ్ తరుణ్ నుండి రెండు సినిమాలు విడుదలయ్యాయి, రెండు కూడా కమర్షియల్ గా డిజాస్టర్ అయ్యాయి. ఇప్పుడు రీసెంట్ గా రెండు రోజుల క్రితం ‘భలే ఉన్నాడే’ అనే చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. టీజర్ , ట్రైలర్ తోనే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రానికి థియేటర్స్ లో విడుదలైన తర్వాత కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా హీరో బలంగా పాల్గొన్నాడు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా కోటి 80 లక్షల రూపాయలకు జరిగింది. మొదటి రోజు ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడం తో దాదాపుగా 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది రీసెంట్ గా విడుదలైన రాజ్ తరుణ్ అన్ని సినిమాల ఓపెనింగ్స్ కంటే ది బెస్ట్ అని అంటున్నారు ట్రేడ్ పండితులు.
అలాగే రెండవ రోజు దాదాపుగా 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అలా రెండు రోజులకు కోటి రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా మూడవ రోజు కూడా 30 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. అలా మూడు రోజులలో కోటి 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, బ్రేక్ ఈవెన్ కి మరో 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది. కొత్త సినిమాలు దగ్గర్లో విడుదల లేకపోవడం తో రాబోయే రోజుల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యి సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు ట్రేడ్ పండితులు. అదే కనుక జరిగితే రాజ్ తరుణ్ కి చాలా కాలం తర్వాత సూపర్ హిట్ దక్కినట్టుగా అనుకోవచ్చు.