Tejashwi Yadav :  మరి కొద్ది రోజుల్లో బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్.. విరాట్ పై మాజీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

మరి కొద్ది రోజుల్లో బంగ్లాదేశ్ జట్టుతో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా తొలి మ్యాచ్ బంగ్లాదేశ్ జట్టుతో భారత్ ఆడుతుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 15, 2024 3:49 pm

Tejashwi Yadav- Virat Kohli

Follow us on

Tejashwi Yadav :  సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ బాంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ సిరీస్ లో ఆడబోతున్నాడు. ఈ ఏడాది జనవరిలో స్వదేశంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో విరాట్ ఆడలేదు.. వ్యక్తిగత కారణాలవల్ల అతడు టెస్ట్ సిరీస్ నుంచి విరామం తీసుకున్నాడు. ఆ సమయంలో అతడు లండన్ లో ఉన్నాడు. నిండు చూలాలిగా ఉన్న తన భార్య పక్కన ఉన్నాడు.. ఆమెకు సపర్యలు చేశాడు. ఆ తర్వాత ఐపీఎల్ లో విరాట్ అదరగొట్టాడు. టి20 వరల్డ్ కప్ లో ఫైనల్ బ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. భారత జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. సుదీర్ఘ విరామం తర్వాత బంగ్లాదేశ్ జట్టుతో జరిగే సిరీస్ ద్వారా టెస్ట్ క్రికెట్లోకి అడుగుపెడుతున్నాడు. అనేక రికార్డులపై గురిపెట్టాడు. ఈ నేపథ్యంలో విరాట్ ఆడే ఇన్నింగ్స్ పై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ నేపథ్యంలో విరాట్ స్ఫూర్తిదాయకమైన ఆట తీరు ప్రదర్శిస్తాడని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

బాంబు పేల్చిన మాజీ ఉపముఖ్యమంత్రి

విరాట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడతాడనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ బాంబు పేల్చాడు. ఓ జాతీయ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించాడు. ” విరాట్ కోహ్లీ నా కెప్టెన్సీలో ఆడాడు. అతడు మాత్రమే కాదు టీమిండియా లో ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో చాలామంది నా సహచరులు. ప్రొఫెషనల్ గా నేను అద్భుతమైన క్రికెటర్ ని. కాకపోతే నాకు లిగమెంట్లు ఫ్రాక్చర్ అయ్యాయి. దీంతో నేను క్రికెట్ ను వదిలి పెట్టాల్సి వచ్చిందని” తేజస్వి యాదవ్ అన్నాడు. ” నేను క్రికెట్ బాగా ఆడేవాడిని. కానీ ఈ విషయాన్ని చాలామందికి తెలియదు. అయినా దీనిని ఎవరూ పట్టించుకోరని” తేజస్వీ పేర్కొన్నాడు..కాగా , తేజస్వి తన కెరియర్లో ఒకటి ఫస్ట్ క్లాస్, 2 లిస్ట్ A, 4 టీ 20 క్రికెట్ మ్యాచ్ లు ఆడాడు. దేశవాళి క్రికెట్లో ఝార్ఖండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2009 లో జరిగిన దేశవాళి టోర్నీలో విదర్భ జట్టుపై జరిగిన మ్యాచ్ ద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2010లో త్రిపుర, ఒడిస్సా జట్లపై రెండు లిస్ట్ A మ్యాచ్ లు ఆడాడు.. ధన్బాద్ లో ఒడిశా, అస్సాం, బెంగాల్, త్రిపుర జట్లపై టి20 మ్యాచ్ ఆడాడు.. వాస్తవానికి 2008లో ఐపిఎల్ సీజన్ సమయంలో తేజస్విని యాదవ్ తో ఢిల్లీ జట్టు ఒప్పందం కుదుర్చుకుంది. 2008 నుంచి 2012 వరకు అతడు ఢిల్లీ జట్టులోనే ఉన్నాడు.. కాకపోతే రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యాడు.