Bhairavam Trailer : చాలా కాలం తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) మన ముందుకు ‘భైరవం'(Bhairavam Movie) చిత్రంతో ఈ నెల 30 వ తారీఖున రాబోతున్నాడు. కేవలం బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రమే కాదు, చాలా కాలం నుండి మంచు మనోజ్(Manchu Manoj), నారా రోహిత్(Nara Rohit) వంటి వారు కూడా సినిమాల్లో కనిపించడం లేదు. వాళ్ళు కూడా ఈ చిత్రం ద్వారానే ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముగ్గురు హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూడడం ఆడియన్స్ కి చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. ఇక మంచు మనోజ్ సంగతి మన అందరికీ తెలిసిందే. ఈమధ్య కాలం లో ఆయన ఎక్కువగా వివాదాల్లోనే ఉంటున్నాడు. ఈ కుటుంబ వివాదం లో నెటిజెన్స్ నుండి మనోజ్ కి భారీ సపోర్ట్ లభిస్తుంది. ఇలాంటి సమయంలో ఆయన నుండి ఈ చిత్రం విడుదల అవ్వబోతుండడం గమనించాల్సిన విషయం.
Also Read: హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ ఖరారు..ఎవరో ఊహించగలరా?
కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ చూసేందుకు బాగానే ఉంది కానీ, ఒరిజినల్ వెర్షన్ ‘గరుడన్’ కి మక్కీకి మక్కి లొకేషన్స్ తో సహా దింపేసినట్టు అనిపించింది. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం మంచి కమర్షియల్ సక్సెస్ ని సాధించింది. హరి, శశికుమార్, ఉన్ని ముకుందన్(మార్కో హీరో) ఈ చిత్రం లో నటించారు. తెలువు వెర్షన్ ‘భైరవం’ లో హరి క్యారక్టర్ ని బెల్లంకొండ శ్రీనివాస్ చేయగా, శశికుమార్ క్యారక్టర్ ని నారా రోహిత్, ఉన్ని ముకుందన్ క్యారక్టర్ ని మంచు మనోజ్ చేశాడు. ఇందులో మంచు మనోజ్ నెగటివ్ రోల్ చేశాడు. నారా రోహిత్ ఒక బలమైన పవర్ ఫుల్ పాజిటివ్ రోల్ చేయగా, ఇందులో హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ కనిపించనున్నాడు. ట్రైలర్ తోనే హీరో ఎవరో అందరికీ ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది.
ఈ ట్రైలర్ ని చూస్తుంటే డైలాగ్స్ చాలా బాగా రాసినట్టుగా అనిపించింది. ప్రారంభంలోనే భగవద్గీత శ్లోకం చెప్పడం చాలా మంచి పాజిటివ్ ఫీలింగ్ రప్పించింది. గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగానే ఈ భూమి మీద ధర్మాన్ని కాపాడడం కోసం ఆ దేవుడే ఎదో ఒక రూపంలో వస్తాడు అనే డైలాగ్ రావడం, ఆ తర్వాత వెంటనే హీరో ని క్లోజప్ షాట్ లో చూపించడం అదిరిపోయింది. అదే విధంగా మంచు మనోజ్ ‘ఇన్ని రోజులు ఈ గజపతి గాడు తగ్గడమే చూసారు..ఇక నుండి నెగ్గడం చూస్తారు’ అని చెప్పే డైలాగ్ కూడా బాగుంది. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాని మక్కీకి మక్కి దింపేసినప్పటికీ, డైలాగ్స్ బాగా రాసారని, మంచి టేకింగ్ తో ఈ చిత్రాన్ని తీసారని, ఈ సమ్మర్ కి మరో సూపర్ హిట్ గా ఈ చిన్న మల్టీస్టార్రర్ చిత్రం నిలుస్తుందని అర్థం అవుతుంది. ఈ ట్రైలర్ ని మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.