Khaleja Re-release : సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ చిత్రాల లిస్ట్ తీస్తే అందులో ఖలేజా(Khaleja Movie) చిత్రం కచ్చితంగా ఉంటుంది. అప్పట్లో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది, అది వాస్తవమే. కానీ కాలక్రమేణా ఈ చిత్రం ఆడియన్స్ బాగా నచ్చింది. ముఖ్యంగా నేటి తరం ఆడియన్స్ లో ఈ చిత్రం కల్ట్ క్లాసిక్ స్టేటస్ ని సొంతం చేసుకుంది. అందుకే ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చెయ్యాలి అంటూ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. వాళ్ళ కోరికను మన్నించి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా నిన్న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు. రెస్పాన్స్ ఊహించిన రేంజ్ లోనే వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం రికార్డు గ్రాస్ నమోదు అవ్వలేదు కానీ, ఓవర్సీస్ లో మాత్రం ఆల్ టైం రికార్డు గ్రాస్ ని నమోదు చేసుకుంది.
నిన్నటి వరకు ‘గబ్బర్ సింగ్’ చిత్రం నార్త్ అమెరికా లో ఆల్ టైం రికార్డు గ్రాసర్ గా నిల్చింది. సుమారుగా 65 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది. మహేష్ ‘ఖలేజా’ మొదటి రోజు వసూళ్ల వరకు ఆల్ టైం రికార్డు నెలకొల్పలేదు కానీ, రెండవ రోజుతో ఆల్ టైం రికార్డు గ్రాసర్ గా నిల్చింది. అక్కడి ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి ప్రీమియర్స్ + మొదటి రోజు కి కలిపి 80 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ రికార్డ్స్ ని ఎక్కడా కూడా అందుకోలేకపోయింది అనే చెప్పాలి. కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతం లో మాత్రమే ఈ చిత్రం ‘గబ్బర్ సింగ్’ కి దగ్గరగా వచ్చింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలకు కలిపి చూస్తే ప్రీమియర్ షోస్ తో కలిపి 5 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు వచ్చాయని తెలుస్తుంది.
Also Read : ‘ఖలేజా’ రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్..కానీ ‘గబ్బర్ సింగ్’ ని ముట్టుకోలేకపోయిందిగా!
ఇక ఓవర్సీస్ , కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి ఈ చిత్రానికి మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 6 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు వచ్చి ఉంటాయి. ఇది కచ్చితంగా రీ రిలీజ్ చిత్రాల్లో అద్భుతమైన వసూళ్లు కానీ ఆల్ టైం రికార్డు మాత్రం కాదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. గబ్బర్ సింగ్ చిత్రానికి మొదటి రోజు + ప్రీమియర్ షోస్ కలిపి 7 కోట్ల 50 లక్షల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. వీకెండ్ లేకపోవడం వల్ల కేవలం 8 కోట్ల రూపాయిల గ్రాస్ తో క్లోజ్ అయ్యింది. కానీ ‘ఖలేజా’ చిత్రానికి మాత్రం ఫుల్ రన్ లో ఆల్ టైం రికార్డు నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి. టాలీవుడ్ నుండి మొట్టమొదటి పది కోట్ల గ్రాస్ రీ రిలీజ్ సినిమా అని కూడా అనొచ్చు.