Bhagavanth Kesari : భగవంత్ కేసరి మూవీని మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఒక సక్సెస్ స్టోరీ ని జడ్జ్ చేయలేకపోతే అది మనకు మైనస్ గా మారే అవకాశం ఉందని మరోసారి ఈ సినిమా విషయంలో ప్రూవ్ అయింది...

Written By: NARESH, Updated On : October 19, 2023 9:22 pm

Bhagavanth Kesari Collections

Follow us on

Bhagavanth Kesari :అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య బాబు భగవంత్ కేసరి అనే సినిమా చేయడం జరిగింది.ఈ సినిమా ఈరోజే రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య బాబు యాక్టింగ్ అద్భుతంగా ఉందని తెలుస్తుంది. అలాగే అనిల్ రావిపూడి డైరెక్షన్ కూడా ఈ సినిమాకు ప్లస్ అయిందని వీళ్లిద్దరి కాంబోలో భగవంత్ కేసరి రూపంలో అదిరిపోయే ఒక బ్లాక్ బస్టర్ హిట్టు పడింది. దానికి తోడుగా ఈ సినిమా లాంగ్ రన్ లో బాలయ్య బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచే అవకాశం కూడా ఉంది. దాంతో ఇప్పుడు వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే అనిల్ రావిపూడి ఈ స్టోరీని సరిలేరు నీకేవ్వరు సినిమా తర్వాత చిరంజీవి కి వినిపించినట్టుగా తెస్తుంది.

ఇక ఈ స్టోరీని విన్న ఆయన సినిమాలో కొన్ని చేంజెస్ చెప్పారట వాటిని చేంజ్ చేయగలిగితే నేను ఈ సినిమా చేస్తాను అని అనిల్ రావిపూడి తో చెప్పినట్టుగా తెలుస్తుంది. కానీ ఆ సీన్లు సినిమాకి కీలకమైన సీన్లు అవడం వల్ల వాటిని మార్చలేక అనిల్ రావిపూడి ఆ ప్రాజెక్టుని పక్కన పెట్టేసి వెంటనే F3 అనే సినిమా తీశాడు ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక దాంతో మళ్లీ ఈ స్టోరీని బయటికి తీసి బాలయ్య బాబుకు ఈ స్టోరీ చెప్పి ఒప్పించి ఆయనతో భగవంత్ కేసరి అనే సినిమాగా దీన్ని మన ముందుకు తీసుకొచ్చాడు.

బాలయ్య బాబు ఈ స్క్రిప్ట్ ని పూర్తిగా నమ్మి అనిల్ రావిపూడి కి సరెండర్ అయిపోయి ఈ సినిమా చేయడం జరిగింది. దాని ఫలితంగా బాలయ్య బాబు కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్టు వచ్చిందనే చెప్పాలి. నిజానికి అనిల్ రావిపూడి అంటే కామెడీ సినిమాలు చేస్తూ వరుస హిట్లు అందుకుంటూ వస్తున్నాడు.ఇక ఇలాంటి డైరెక్టర్ మాస్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ గా పిలుచుకునే బాలయ్య బాబుని ఎలా చూపిస్తాడు అనే ప్రశ్న ప్రతి ఒక్క అభిమానిలో కలిగింది. కానీ దానికి ఏ మాత్రం తీసిపోకుండా బాలయ్య బాబుని ఒక సింహంలా అనిల్ రావిపూడి ప్రజెంట్ చేయడం జరిగింది. దీనివల్ల చిరంజీవి ఒక హిట్ సినిమాను కోల్పోతే బాలయ్య బాబు మాత్రం ఒక బిగ్గెస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా సినిమా ఇండస్ట్రీలో ఒక సక్సెస్ స్టోరీ ని జడ్జ్ చేయలేకపోతే అది మనకు మైనస్ గా మారే అవకాశం ఉందని మరోసారి ఈ సినిమా విషయంలో ప్రూవ్ అయింది…