Bhagavanth Kesari : బాలయ్య సినీ జీవితంలో హైయెస్ట్ బిజినెస్ జరిగిన మూవీ భగవంత్ కేసరి.. లాభమెంతో తెలుసా?

మంచి టాక్ రావడంతో ఈ వీక్ లో కలెక్షన్స్ ఓ రేంజ్ లో రావడం ఖాయమని.. బ్రేక్ ఈవెన్ దాటే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Written By: NARESH, Updated On : October 19, 2023 10:44 pm
Follow us on

Bhagavanth Kesari Pre Release Business : దసరా కానుకగా అక్టోబర్ 19న గురువారం భగవంత్ కేసరి విడుదలైంది. మూవీకి డీసెంట్ టాక్ దక్కింది. ఫస్ట్ డే భగవంత్ కేసవరి వసూళ్లు పరిశీలిస్తే… ఇండియా వైడ్ రూ. 14 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇండియాలో భగవంత్ కేసరి మొదటి రోజు 67% ఆక్యుపెన్సీ నమోదు చేసినట్లు సమాచారం. ఇది డీసెంట్ ఫిగర్ అని చెప్పాలి.

ఇక యూఎస్ ప్రీమియర్ వసూళ్లతో భగవంత్ కేసరి $506300 వసూళ్లు అందుకుంది. అంటే రూ. 4.21 కోట్ల వసూళ్లు రాబట్టింది. బ్యాక్ టు బ్యాక్ ప్రీమియర్స్ తో బాలయ్య హాఫ్ మిలియన్ వసూళ్ల రికార్డు నమోదు చేశాడు. ఏరియా వైజ్ వివరాలు అందాల్సి ఉంది. భగవంత్ కేసరి ఫస్ట్ డే వసూళ్ల పూర్తి సమాచారం అందాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే. ఈ చిత్రానికి జరిగిన బిజినెస్ రీత్యా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాల్సి ఉంది. రూ. 66 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బాలయ్య బరిలో దిగాడు.

బాలయ్య కెరీర్ లోనే భగవంత్ కేసరి హయ్యెస్ట్ ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా నిలిచింది. వీరసింహారెడ్డి, ఎన్టీఆర్ కథానాయకుడు తర్వాత బాలయ్య కెరీర్ లోనే అత్యధిక ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా భగవంత్ కేసరి రికార్డు క్రియేట్ చేసింది. విడుదలకు ముందే అన్నీ కలిపి 135 కోట్ల బిజినెస్ జరిగింది.. సినిమాకు బడ్జెట్ 120 కోట్లు కాగా.. విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ లాభం ముందే 15 కోట్లు వచ్చిపడ్డారు. ఇక థియేట్రికల్ బిజినెస్ 85 కోట్లు…శాటిలైట్ సహా మిగతా వన్నీ 50 కోట్లు. అంటే ఇది బాలయ్య కెరీర్ లోనే అత్యధికం.. పైగా విడుదలకు ముందే లాభాలు 15 కోట్లు వచ్చిపడ్డాయి.

గతంలో వీరసింహారెడ్డి మూవీ థియేట్రికల్ రైట్స్ 73 కోట్లుకు అమ్ముడుపోయాయి. ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ 70 కోట్లకు అమ్మి 3వ వస్థానంలో నిలచింది.

బాలకృష్ణ క్రేజ్, అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ కు ఈ భగవంత్ కేసరి సినిమాకు బిజినెస్ బాగా జరిగింది. అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో జరిగాయి. రిలీజ్ కు మూడు రోజుల ముందే రెండు కోట్ల వరకూ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. మంచి టాక్ రావడంతో ఈ వీక్ లో కలెక్షన్స్ ఓ రేంజ్ లో రావడం ఖాయమని.. బ్రేక్ ఈవెన్ దాటే అవకాశాలున్నాయని తెలుస్తోంది.