Bhadrakaali Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి కథలతో హీరోలు సినిమాలను చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలో కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి ‘బిచ్చగాడు’ సినిమాతో హీరో అవతారం ఎత్తిన విజయ్ ఆంటోనీ అప్పటినుంచి ఇప్పటివరకు డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలను చేస్తూ వస్తున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఈ సంవత్సరం ఇప్పటికే ‘మార్గాన్’ అనే సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన ఇప్పుడు ‘భద్రకాళి’ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాల్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే కిట్టు అనే ఒక పొలిటికల్ మీడియేటర్ తనకు నచ్చిన పనులను చేస్తూ తన జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన ఒకరోజు చేసిన పని వల్ల అనుకోని అనర్ధాలైతే జరుగుతాయి. మరి దాని వల్ల కిట్టు ఎలా సఫర్ అయ్యాడు… ఆయన చేసిన తప్పేంటి అనేది తెలియాలంటే మాత్రం మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమా దర్శకుడు అయిన ‘అరుణ్ ప్రభు’ అవినీతి అనే పాయింట్ ను తీసుకున్నాడు. ఇంతకుముందు తమిళ డైరెక్టర్ శంకర్ చేసిన సినిమాలన్నీ కూడా అవినీతి ని నిర్మూలించాలి అనే బాటలోనే ఉంటాయి. మరి ఆయన తరహాలోనే అరుణ్ ప్రభు కూడా ఒక డిఫరెంట్ సినిమాను చేయాలి అనుకున్నాడు. కానీ తను అనుకున్న రేంజ్ లో సినిమాను మాత్రం చేయలేకపోయాడు. ఆయన సినిమాను స్టార్ట్ చేసిన విధానం బాగున్నప్పటికి ఆ సమయంలోనే సినిమా కథని ఎటు నుంచి ఎటో తిప్పాడు.
దానివల్ల కథలో ఉన్న ఆ ఫ్రెష్ నెస్ అనేది పోయింది. తద్వారా హీరో ఏం చేస్తున్నాడు ఇదంతా ఎందుకు జరుగుతోంది అనే ఒక కన్ఫ్యూజన్ అయితే ప్రేక్షకుడికి కలుగుతోంది. మధ్య మధ్యలో కనెక్టివిటీ రావడానికి కొన్ని సన్నివేశాలు ఉన్నప్పటికి అవి ప్రేక్షకుడికి పెద్దగా ఇంపార్టెంట్ ను అయితే క్రియేట్ చేయలేకపోయాయి. మొదట్లో ప్రేక్షకులు ఏ పాయింట్ కి అయితే స్టిక్ అవుతాడో దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా ప్రేక్షకుడిని అటు ఇటు తిప్పుతూ ఉంటే వాడి మైండ్ డివియెట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.
తద్వారా వాడికి ఏ పాయింట్ మీద ఫోకస్ చేసి చూడాలి అనే ఒక క్లారిటీ అయితే మిస్ అవుతోంది. అందుకే ఒక స్టోరీ రాసుకున్నప్పుడు ఒకే టెంపు లైన్ లో ఉండే విధంగా చూసుకోవాలి. ఒకవేళ మల్టిపుల్ టెంప్లైన్స్ లో ఉన్నా కూడా దాని ఒరిజినల్ ప్లాట్ పాయింట్ ఏంటి అనేది తెలుసుకున్నప్పుడు ప్రేక్షకులకు దాన్ని హుక్ అయి ఆ పాయింట్ ని దర్శకుడు ఎలా తీసుకెళ్తున్నారు అనేదానిమీద ఫోకస్ అయితే పెడతాడు.
ఈ సినిమాలో అక్కడక్కడ హై ఇచ్చే సన్నివేశాలు కనిపించినప్పటికి వాటి ఎగ్జిక్యూషన్ ప్రేక్షకులకు అంత పెద్దగా రీచ్ అయితే అవ్వలేదు. ఇక విజయ్ ఆంటోని నుంచి ప్రతి ఎక్స్పరిమెంటల్ సినిమా వస్తున్నప్పుడు ఏదో ఒక కొత్తదనాన్ని అయితే చెప్పబోతున్నాడు అనే విషయం అయితే ప్రేక్షకులకు అర్థమవుతోంది. కానీ దాన్ని స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేసినప్పుడు ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతోంది. అలా కాకుండా తడబడ్డ ప్రతిసారి సినిమాలైతే ఫ్లాప్ అవుతున్నాయి…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా నటించాడు. ఇంతకుముందు తన సినిమాలన్నింటిలో ఎలాగైతే డిఫరెంట్ పాత్రలు ఎంచుకొని ఒక సాహసంగా చేస్తూ ముందుకు సాగాడో ఈ సినిమాలో అంతకుమించిన సాహసాలను ఎదుర్కొంటూ సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చడానికి తీవ్రమైన ప్రయత్నం చేశాడు…
ఇక రియా జితూ తన పాత్రలో ఒదిగిపోయి నటించింది. ముందు వచ్చే కొన్ని సన్నివేశాల్లో తను చాలా మంచి పర్ఫామెన్స్ అయితే ఇచ్చింది. సెకండ్ హాఫ్ లో ఆమె పాత్రకి పెద్దగా స్కోప్ అయితే లభించలేదు అనిపించింది… మిగిలిన పాత్రల్లో చేసిన ప్రతినిధులు తన పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికొస్తే ఈ సినిమాకి మ్యూజిక్ కూడా పెద్దగా ప్లస్ అయితే కాలేదు. బ్యా గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. సీన్ ఒక టెంప్లైన్ లో నడుస్తుంటే బ్యాగ్రౌండ్ స్కోర్ మరొకటి ఎమోషన్ లో వస్తోంది.
అసలు ఆ బ్యా గ్రౌండ్ స్కోర్ అలా ఇవ్వాలని ఎవరు డిసైడ్ చేశారు. అది దర్శకుడు ఛాయిసా లేదంటే మ్యూజిక్ డైరెక్టర్ కావాలని అలా అనేది కూడా అర్థం కాలేదు. అక్కడ ఒక రకమైన ఎమోషన్ ఉంటే ఇక్కడ మరొక రకమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే పడుతోంది… ఎడిటింగ్ విషయంలో కూడా ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది… ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నంతలో ఓకే అనిపించాయి…
ప్లస్ పాయింట్స్
విజయ్ ఆంటోనీ యాక్టింగ్
విజువల్స్
మైనస్ పాయింట్స్
కథ
డైరెక్షన్
మ్యూజిక్
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2/5