
కరోనా దెబ్బకి ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం లాక్ డౌన్లో ఉండటం తప్పనిసరి అయిపోయింది. అయితే ఇలాగే మరో ఏడాది దాకా ఎక్కడా ఎలాంటి పనులు, కార్యక్రమాలు జరగకపోతే ఇండస్ట్రీని నమ్ముకుని బతుకు లాక్కోస్తున్న సినీ కార్మికుల పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. అందుకే చిన్న వెబ్ ఫిల్మ్స్ లాంటివి తీయడానికి కొత్త వారికి ఒక ఈజీ ప్లాట్ ఫామ్ ను క్రియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెద్ద నిర్మాతలందరూ తలా చేయి వేస్తే.. చాలా కంటెంట్ బయటకు వస్తోంది. చాలామందికి పని దొరుకుతుంది. మరి ఇండస్ట్రీ పెద్దలు ఆ దిశగా ఆలోచించాలని ఆశిద్దాం.
Also Read: మహిళా టెర్రరిస్ట్‌గా సమంత!
అలాగే హీరోలు, హీరోయిన్లు కూడా ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు. అటు జనం సైతం ఎక్కువ సమయాన్ని టీవీలు, సోషల్ మీడియా మీదే గడుపుతూ.. కరోనా భయంతో టైమ్ పాస్ చేస్తున్నారు. కాబట్టి మేకర్స్ కి డిజిటల్ ప్రమోషన్లకు ఇదే సరైన సమయం అనుకోవచ్చు. ఇప్పటికే లాక్ డౌన్ మూలంగా చాల సినిమాలు వాయిదాపడ్డాయి, అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఇప్పుడే చెప్పలేని పరిస్తితి. వాటిలో ముఖ్యంగా నాని, సుధీర్ బాబుల ‘వి‘, అనుష్క ‘నిశ్శబ్దం‘, రానా ‘అరణ్య‘ చిత్రాలతో పాటు, ‘ఉప్పెన, ఒరేయ్ బుజ్జిగా, రెడ్, మిస్ ఇండియా’ లాంటి సినిమాలు ఉన్నాయి.
Also Read: బాలయ్య సినిమాలో భారీ మార్పులు !
ఎప్పుడో ఏప్రిల్ నెలలోనే విడుదలకావాల్సిన ఈ సినిమాలు మరో ఏడాది దాకా రిలీజ్ చెయ్యకుండా ఉంచాలంటే కష్టమే. అందుకే ఓటీటీలో రిలీజ్ చేయడం బెటర్. అలా రిలీజ్ చేయాలంటే సినిమా పై జనంలో మంచి అంచనాలు ఉండాలి. ఉంటే.. జనం డబ్బులు పెట్టి సినిమాలు చూడటానికి రెడీగానే ఉన్నారు. కాబట్టి మేకర్స్ ఫస్ట్ తమ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్లు వేగవంతం చేసి రిలీజ్ కి సిద్ధం చేస్తే మంచిది. పైగా ఇలాంటి సినిమాలకు చాలా గ్యాప్ కూడా వచ్చింది. ఈ సినిమాల కోసం ప్రేక్షకులు కూడా అలర్ట్ గా ఉంటారు. మరి మేకర్స్ ఏమి చేస్తారో చూడాలి.