
షూటింగ్స్ లేవు.. సినీ కార్మికులు ఆర్ధిక ఇబ్బందులు రెట్టింపు.. దాంతో రంగుల ప్రపంచంలోని లేని బతుకులు ఇప్పటికే అతలాకుతలం.. మరో పక్క రోజురోజుకూ దిగజారిపోతున్న పరిస్థితులు… కానీ ప్రభుత్వాలు మాత్రం సినిమా వాళ్లకు చేసిన సాయం మాత్రం ఏమి లేదు, అందరికీ అన్ని చేస్తున్నా.. సినిమా వాళ్లను మాత్రం ఈ ప్రభుత్వాలు గాలికి వదిలేసాయి. సినిమాని అందరూ చూస్తారు.. కానీ సినిమా వాడు అనగానే ఒక నెగిటివ్ ఫీలింగ్. ఇప్పుడు కృష్ణ నగర్ లో వీధిలో పది ఇల్లులు ఉంటే ఏడు ఖాళీ. ఎక్కడికి పోయారు మిగిలిన వారంతా.. అని ఎవ్వరూ అడిగే ధైర్యం కూడా చేయట్లేదు.
సినీ పెద్దలు ‘కరోనా క్రైసిస్ చారిటీ’ పెట్టి సాయం అందించినా.. ఆ సాయం పది పదిహేను రోజులకే పనికొస్తుంది. మళ్ళీ ఆకలి.. పెట్టేవాడు లేడు. ఈ విషయంలో ఎవర్నీ నిధించలేము. అలా అని ఖర్మ అనుకోలేం.. మెగాస్టార్, సూపర్ స్టార్ లాంటి హీరోలు మనకు ఉన్నారు. వారు తలుచుకుంటే మళ్ళీ సాయం అందకపోతుందా.. అనే ఆశ. నిజానికి ఇటివలే చేసిన సాయం కూడా అంతంత మాత్రమే. పైగా కేవలం ఫిల్మ్ కి సంబంధించి ఏదొక అసోసియేషన్ లో మెంబర్ అయినవాళ్లకు మాత్రమే… కానీ సినిమాలకు పని చేసే వాళ్లల్లో కొంతమందికి ఎలాంటి మెంబర్ షిప్ ఉండదు అనే విషయం మన స్టార్ లకు తెలియదు అనుకోలేము. కానీ వారు చొరవ తీసుకోలేదు అంతే.
Also Read: ప్రభాస్ మూవీలో దీపిక పాత్ర రివీల్!
ఎలాంటి మెంబర్ షిప్ లేని వాళ్ళు పడుతున్న కష్టాలు వింటే కన్నీళ్లు వస్తున్నాయని కొంతమంది సినిమా మిత్రులు చెబుతుంటే.. ఎందుకు ఈ ప్రభుత్వం ఆదుకోవట్లేదు అని అనుమానం కలుగుతోంది.. సినిమా వాళ్లలో చాలామంది పక్క రాష్ట్రం వారే. వారికి తెలంగాణలో ఓటు హక్కు లేదు. అందుకే కేసీఆర్ ప్రభుత్వం సినిమా వాళ్ళను పట్టించుకోవట్లేదా…! షూటింగ్స్ జరిగినా.. రోజులు గడుస్తాయనే నమ్మకం లేని ఫీల్డ్ లో పని చేస్తున్న సినిమా వాళ్ల పై, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం జాలి చూపిస్తే మంచింది. అలాగే ఏ క్రాఫ్ట్ లో మెంబర్ కాని వేల మంది సినీ కార్మికులకు అందని సాయాన్ని వారికి అందేలా, వాళ్ళు పడుతున్న తీవ్ర ఇబ్బందులను తీర్చే విధంగా సీసీసీ మరియు కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తే బాగుంటుంది.