spot_img
Homeఎంటర్టైన్మెంట్Kalki 2898 AD Sequel: 'కల్కి 2' లో కోలీవుడ్ హీరో శింబు.. ఎలాంటి...

Kalki 2898 AD Sequel: ‘కల్కి 2’ లో కోలీవుడ్ హీరో శింబు.. ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడంటే..

Kalki 2898 AD Sequel: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న సీక్వెల్స్ లో అభిమానుల్లో , మూవీ లవర్స్ లో విపరీతమైన అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రం ‘కల్కి 2’. 2024 వ సంవత్సరం లో విడుదలైన ‘కల్కి 2898 AD’ చిత్రం ఒక వెండితెర అద్భుతం, దర్శకుడి అద్భుతమైన విజన్ కి నిదర్శనం. మహాభారతం క్యారెక్టర్స్ కి సైన్స్ ఫిక్షన్ జోడించాలనే ఆలోచనే అసాధ్యమైనది, ఆ అసాధ్యమైన విజన్ ని వెండితెర మీద అద్భుతంగా ఆవిష్కరించడం అనేది సాధారణమైన కళ కాదు. మిగతా మేకర్స్ లాగా, ఎదో కమర్షియల్ గా డబ్బులు చేసుకుందామని ప్రకటించిన సీక్వెల్ కాదు ఇది. స్టోరీ చాలా బలంగా సీక్వెల్ ని డిమాండ్ చేస్తుంది. ఇలాంటి సినిమాలే బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తుంటాయి. ఇకపోతే రీసెంట్ గానే ఈ సీక్వెల్ కి సంబంధించిన షూటింగ్ ని మొదలు పెట్టారు మేకర్స్.

మొదటి షెడ్యూల్ లో అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక రెండవ షెడ్యూల్ లో ప్రభాస్ కూడా జాయిన్ అవ్వబోతున్నాడు. అందుకోసం భారీ సెట్స్ ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సెట్స్ లో ప్రభాస్, కమల్ హాసన్ , అమితాబ్ బచ్చన్ మరియు హీరోయిన్ లపై ఇంటర్వెల్ సీక్వెన్స్ ని తెరకెక్కించబోతున్నారట. ముందుగా మొదటి భాగం లో హీరోయిన్ గా నడిచిన దీపికా పదుకొనే ఈ చిత్రం నుండి తప్పుకోవడం తో , సాయి పల్లవి ని ఎంచుకున్నారు. కానీ ఆమె కూడా ఇప్పుడు ఈ చిత్రం నుండి తప్పుకుంది అట, ఇప్పుడు ఆమె స్థానంలోకి బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అలియా భట్ ని తీసుకున్నట్టు సమాచారం. ఇది కాసేపు పక్కన పెడితే, ఈ చిత్రం లో మరో క్రేజీ హీరో కూడా భాగం కాబోతున్నాడని అంటున్నారు.

ఆ హీరో మరెవరో కాదు , కోలీవుడ్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ , యూత్ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న శింబు. క్లైమాక్స్ లో ఈయన పాత్ర ఎంట్రీ ఇస్తూ , సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్తుందని అంటున్నారు. ఇంతకీ ఆయన ఏ పాత్ర వేయబోతున్నాడు?, ‘కల్కి’ పాత్ర ని వేయబోతున్నాడా?, లేదా మహాభారతం లో వేరే క్యారెక్టర్ ఏదైనా వెయ్యబోతున్నాడా అని సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. మొదటి భాగం లో ఈ జనరేషన్ కి చెందిన యంగ్ హీరోలు విజయ్ దేవరకొండ, డుల్కర్ సల్మాన్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు రెండవ భాగం లో శింబు ఎంట్రీ ఇచ్చాడు , రాబోయే రోజుల్లో ఇంకా ఎంత మంది క్రేజీ హీరోలు జాయిన్ అవుతారో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Oktelugu Epaper
Exit mobile version