https://oktelugu.com/

సీనియర్ హీరోయిన్ కారులో భారీగా పట్టుబడిన మద్యం

సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం పట్టుబడటం సంచలనంగా మారింది. ఈ సంఘటనలో రమ్యకృష్ణ కారు డ్రైవర్ సెల్వకుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విషయంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారింది. రమ్యకృష్ణ కారులో మద్యం భారీగా పట్టుబడటంపై పలు అనుమానాలు రెకేత్తిస్తున్నాయి. అయితే దీనిపై రమ్యకృష్ణ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. ట‌యోటా ఇన్నోవా క్రిస్టా(టీఎన్‌07క్యూ 0099) కారు రమ్యకృష్ణ పేరుపై రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. కారు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 13, 2020 / 07:25 PM IST
    Follow us on


    సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం పట్టుబడటం సంచలనంగా మారింది. ఈ సంఘటనలో రమ్యకృష్ణ కారు డ్రైవర్ సెల్వకుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విషయంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారింది. రమ్యకృష్ణ కారులో మద్యం భారీగా పట్టుబడటంపై పలు అనుమానాలు రెకేత్తిస్తున్నాయి. అయితే దీనిపై రమ్యకృష్ణ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.

    ట‌యోటా ఇన్నోవా క్రిస్టా(టీఎన్‌07క్యూ 0099) కారు రమ్యకృష్ణ పేరుపై రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. కారు డ్రైవర్ సెల్వకుమార్ మహాబలిపురం నుంచి చెంగల్పట్టుకు వస్తుండగా పోలీసులు తనిఖీ చేపట్టారు. ఈక్రమంలో రమ్యకృష్ణ కారులో 96బీర్ బాటిళ్లు, ఎనిమిది ఫుల్ బాటిళ్ల మద్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.

    అయితే చెన్నైలో మద్యం లభించపోవడంతో పుదుచ్చేరి నుంచి మద్యం తెస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో డ్రైవర్ సెల్వకుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సెల్వకుమార్ కు పోలీసులు బెయిల్ మంజూరు చేశారు. రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం దొరకడంపై ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.