ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కన్నన్ మృతి

2020 సంవత్సరం చిత్రసీమకు పెద్దగా కలిసిరావడం లేదు. కరోనాతో సినిమా షూటింగులు వాయిదా పడగా, థియేటర్లు మూతపడ్డాయి. దీంతో సినీ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకునేందుకు సెలబ్రెటీలు చేతనైనంత సాయం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు మృతి చెందాడం విషాదంగా మారింది. శనివారం నాడు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ బి.కన్నన్(69) మృతి చెందాడం శోచనీయంగా మారింది. కన్నన్ గత కొన్నిరోజులుగా గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవలే దీనికి […]

Written By: Neelambaram, Updated On : June 13, 2020 7:32 pm
Follow us on


2020 సంవత్సరం చిత్రసీమకు పెద్దగా కలిసిరావడం లేదు. కరోనాతో సినిమా షూటింగులు వాయిదా పడగా, థియేటర్లు మూతపడ్డాయి. దీంతో సినీ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకునేందుకు సెలబ్రెటీలు చేతనైనంత సాయం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు మృతి చెందాడం విషాదంగా మారింది. శనివారం నాడు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ బి.కన్నన్(69) మృతి చెందాడం శోచనీయంగా మారింది.

కన్నన్ గత కొన్నిరోజులుగా గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవలే దీనికి ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదటపడకపోవడంతో శనివారం చైన్నెలో మృతిచెందాడు. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. కన్నన్ తెలుగులో ‘పగడాల పడవ’, ‘కొత్త జీవితాలు’, ‘సీతాకోక చిలుక’, ‘ఆరాధన’ మూవీలకు సినిమాటోగ్రర్ గా పని చేశారు. తమిళం, మలయాళంలో 50కిపైగా మూవీలకు సినిమాటోగ్రఫర్ గా పని చేశారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజాతో కన్నన్ కు మంచి అనుబంధం ఉంది. భారతీరాజాతో కలిసి దాదాపు 40 సినిమాలకు కన్నన్ పని చేశారు.

కన్నన్ మృతిపై ప్రముఖ నటి ఖుష్బూ సోషల్ మీడియాలో స్పందించారు. ‘2020 సంవత్సరం ఏ మాత్రం బాలేదు.. మరో గొప్ప వ్యక్తి, ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కన్నన్‌ను కోల్పోయాం.. ‘కెప్టెన్‌ మగళ్‌’ సినిమా కోసం ఆయనతో కలిసి పనిచేశా.. భారతీరాజా సర్ పర్మనెంట్‌ కెమెరామెన్‌ ఆయన.. ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నా.. మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాం కన్నన్‌ సర్‌’ అని ఖుష్బూ ట్వీట్‌ చేశారు. కాగా శనివారం సాయంత్రం 6గంటలకు కన్నన్ పార్థివదేహాన్ని అల్వార్ పేటలోని ఆయన నివాసం వద్ద ఉంచుతారు. ఆదివారం అంత్యక్రియలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కన్నన్ కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.