Bedurulanka 2012 Collections: ఆర్ఎక్స్ 100తో సంచలన విజయం అందుకున్న హీరో కార్తికేయ కెరీర్ ఒడిదుడుకులతో సాగుతుంది. ఆయనకు మరో హిట్ పడలేదు. ఈ క్రమంలో అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఆయన తాజా చిత్రం బెదురులంక 2012. ఆగస్టు 25న వరల్డ్ వైడ్ విడుదలైంది. బెదురులంక 2012 మూవీ డీసెంట్ టాక్ తెచ్చుకుంది. అందుకు తగ్గట్లే వసూళ్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బెదురులంక మొదటి రోజు రూ. 1.36 కోట్ల గ్రాస్, రూ. 70 లక్షల షేర్ రాబట్టింది. నైజాంలో రూ. 42 లక్షలు, సీడెడ్ రూ. 23 లక్షలు వసూలు చేసింది. ఉత్తరాంధ్రలో రూ. 20 లక్షల రాబట్టింది.
కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి రూ. 27 లక్షల గ్రాస్ వసూళ్లు అందుకుంది. వరల్డ్ వైడ్ బెదురులంక 2012 ఫస్ట్ డే రూ. 84 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. బెదురులంక 2012 మూవీ రూ.4.10 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 4.50 కోట్ల టార్గెట్ తో బరిలో దిగింది. మరో రూ. 3.6 కోట్లు వసూలు చేస్తే క్లీన్ హిట్ అవుతుంది. ట్రెండ్ చూస్తుంటే కష్టమే అనిపిస్తుంది. మొదటిరోజు కోటి కోటిన్నర షేర్ వసూలు చేసి ఉంటే బాగుండేది.
బెదురులంక యుగాంతం అనే పాయింట్ ఆధారంగా తెరకెక్కించారు. గోదారి మధ్యలో ఉన్న బెదురులంక ప్రజల్లో యుగాంతం వచ్చేస్తుందనే భయం, ఆలోచన ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది అన్న కోణంలో తెరక్కించారు. శ్రీకాంత్ అయ్యర్, అజయ్ ఘోష్, రామ్ ప్రసాద్, కసిరెడ్డి కీలక రోల్స్ చేశారు. దర్శకుడు చివరి 30 నిమిషాలు మెప్పించాడనే మాట వినిపిస్తోంది.
కార్తికేయకు జంటగా డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి నటించింది. కార్తికేయతో నేహా శెట్టి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంది. దర్శకుడు క్లాక్స్ తెరకెక్కించారు. ఈ చిత్రం విజయంపై కార్తికేయ చాలా ఆశలే పెట్టుకున్నాడు. కాగా కార్తికేయ ఆ మధ్య విలన్ రోల్స్ చేశాడు. నాని హీరోగా తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ మూవీ విలన్ రోల్ చేశాడు. అలాగే అజిత్ హీరోగా తెరకెక్కిన వలిమై చిత్రంలో కూడా విలన్ పాత్ర చేశాడు. వలిమై సూపర్ హిట్ కొట్టింది.