Anchor Roshan: ఒకప్పుడు సినిమాల్లో నటించేవాళ్లు మాత్రమే సెలబ్రెటీలుగా మారేవారు. వీరు సినిమాల్లో తప్ప ఇతర ఎక్కడా కనిపించేవారు కాదు. ఏదైనా ఈవెంట్లలో కనిపిస్తే ఫ్యాన్స్ చుట్టుముట్టేవారు. కానీ ఇప్పుడు వివిధరంగాలకు చెందినవారు కూడా ఫేమస్ అవుతున్నారు. ముఖ్యంగా టీవీల్లో యాంకర్లుగా పనిచేసినవారు సైతం సినీ స్టార్ల లెవల్లో పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. ఇటీవల సుమన్ టీవీ కి చెందిన మీమ్స్ సోషల్ మీడియాలో రచ్చవుతున్నాయి. ముఖ్యంగా ఇందులో యాంకర్ గా పనిచేసిన రోషన్ గురించి రకరకాలుగా చర్చించుకుంటున్నారు. తాజాగా రోషన్ అసలు పేరు అది కాదు శ్రీనివాసరెడ్డి.. అంటూ కొందరు కామెడీ తలపించేలా ఇమేజ్ తయారు చేసి ఫేస్బుక్ లో పెట్టడంతో అది వైరల్ గా మారింది. ఇంతకీ రోషన్ బయోగ్రఫీ ఏంటి? ఆయన యాంకర్ గా కెరీర్ ఎలా ప్రారంభించాడు?
Suman TV యాంకర్ గా ఫేమస్ అయిన రోషన్ అసలు పేరు శ్రీనివాసరెడ్డి. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా బొల్లాపల్లిలో 1990 నవంబర్ 4వ తేదీన జన్మించారు. గుంటూరులో డిగ్రీ చేసిన ఆయన చెన్నైలోని డాకట్ర్ ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ నుంచి బీ ఫార్మసీ పూర్తి చేశాడు. ఆ తరువాత హైదరాబాద్ లోని జెఎన్ టీయూలో ఎం ఫార్మసీ చేశాడు. అయితే మెడికల్ ఫీల్డులోనే ఎక్కువగా విద్యాభ్యాసం చేసిన ఆయన ఆ రంగంలో స్థిరపడేందుకు ఇష్టపడలేదు. మీడియా రంగం అతడిని ఆకర్షించింది.
ఈ నేపథ్యంలో 2017లో శ్రీనివాసరెడ్డి సుమన్ యూ ట్యూబ్ ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించాడు. ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూ సీనియర్ నటుడు భానుచందర్ తో చేశాడు. ఈ ఇంటర్వ్యూ ఫేమస్ కావడంతో శ్రీనివాసరెడ్డికి గుర్తింపు వచ్చింది. దీంతో ఆయన తన పేరును రోషన్ గా మార్చుకొని పలు ఇంటర్వ్యూలు చేశాడు. ఇలా ఇప్పటి వరకు 1000 మంది సెలబ్రెటీలతో ఇంటర్వ్యూచేసి ప్రత్యేకత చాటుకున్నాడు. ఆయన ఇంటర్వ్యూలతో సుమన్ టీవీ అభివృద్ధిచెందింది. ప్రస్తుతం ఆయన ఆ ఛానెల్ కు సీఈవోగా కొనసాగుతున్నారు.
కేవలం ఇంటర్వ్యూలో మాత్రమే కాకుండా హోం టూర్ లను నిర్వహించేవారు. సెలబ్రెటీలు, గుర్తింపు పొందినకంపెనీల వద్దకు నేరుగా వెళ్లి వారి స్థితిగతులను తెలుసుకున్నారు. ఈ క్రమంలో సుమన్ టీవీ యాజమాన్యం ఇటీవల ఏపీ సీఎం జగన్ ను కలిశారు. అప్పటి నుంచి కొందరు సుమన్ టీవీతో పాటు రోషన్ ను కూడా మీమ్స్ తో వైరల్ చేస్తున్నారు. తాజాగా ఆయన పేరు రోషన్ కాదు.. శ్రీనివాసరెడ్డి అని ‘ఖలేజా’ మూవీకి సంబంధించిన సీన్స్ మాదిరిగా డైలాగ్స్ చెబుతుండడం ఆకట్టుకుంటోంది.