https://oktelugu.com/

Tiger 3: టవల్ సీన్ వల్ల టైగర్ 3 సినిమాకు రూ. 1000 కోట్లు.. అసలేంటి సీన్.. దాని కథేంటి?

లేటెస్ట్ బాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ యొక్క టోటల్ రన్ టైం 155 నిముషాలు అంటే 2 గం. 35 ని. లుగా ఉందని సమాచారం అందుతోంది. బాద్షా షారుఖ్ ఖాన్ క్యామియో రోల్ లో కనిపించనున్న ఈ మూవీ దీపావళి కానుకగా నవంబర్ 12న గ్రాండ్ గా రిలీజ్ అవడానికి సిద్దమైంది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 28, 2023 / 10:36 AM IST

    Tiger 3

    Follow us on

    Tiger 3: కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో రాబోతున్న లేటెస్ట్ మూవీ టైగర్ 3. వై ఆర్ ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ఈ సినిమా. ఇందులో సల్మాన్ ఖాన్ సరసన బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ జతకట్టగా.. మనీష్ శర్మ దీనిని తెరకెక్కించారు. ఈ సినిమా నుంచి ఓ సాంగ్, ట్రైలర్ రిలీజ్ అయినా సంగతి తెలిసిందే. ఈ రెండు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అంతే కాదు ట్రైలర్ చూపించిన టవల్ ఫైట్ ఏకంగా మంత్రముగ్ధులను చేసిందని కామెంట్లు కూడా చేస్తున్నారు.

    అయితే లేటెస్ట్ బాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ యొక్క టోటల్ రన్ టైం 155 నిముషాలు అంటే 2 గం. 35 ని. లుగా ఉందని సమాచారం అందుతోంది. బాద్షా షారుఖ్ ఖాన్ క్యామియో రోల్ లో కనిపించనున్న ఈ మూవీ దీపావళి కానుకగా నవంబర్ 12న గ్రాండ్ గా రిలీజ్ అవడానికి సిద్దమైంది. ఇక టైగర్ 3 సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు యాష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ ఫై ఆదిత్య చోప్రా. అయితే ఈ మూవీలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన మూవీ ప్రమోషన్స్ ను కూడా ప్రారంభించింది చిత్ర యూనిట్.

    ట్రైలర్ లో చూపించిన విధంగా టవల్ ఫైట్ తోనే సినిమా ప్రమోషన్స్ ను మొదలు పెట్టింది. ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోన్న ఆ సీన్‌ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు, సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. ఎంతో డిఫరెంట్ గా ఉన్న ఈ సీన్ వల్ల సినిమా హిట్ పక్కా అంటున్నారు నెటిజన్లు. అంతేకాదు కత్రినా కైఫ్ డిఫరెంట్ లుక్ లో అది కూడా ఫైటింగ్ సీన్ లో టవల్ తోనా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ సీన్ సీక్వెన్స్‌తో రూ.1000 కోట్లు ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి అందరి అంచనాలను పెంచుతూ సినిమా హిట్ అవుతుందా? లేదా తలకిందులవుతుందా అనేది.