https://oktelugu.com/

Sara Ali Khan: స్టార్ కిడ్స్ అనన్య, సారా అలీ ఖాన్ వర్క్ అవుట్ వీడియో… జిమ్ ఫిట్ లో చెమటలు చిందిస్తున్న భామలు!

బాలీవుడ్ భామలైతే ఈ విషయంలో మరింత సీరియస్. ఫిట్నెస్ ఫ్రీక్ గా సారా అలీ ఖాన్ పేరు తెచ్చుకుంది. నటుడు సైఫ్ అలీ ఖాన్ కూతురైన సారా అలీ ఖాన్ టీనేజ్ లో ఊబకాయంతో ఉండేది.

Written By:
  • NARESH
  • , Updated On : October 28, 2023 / 10:39 AM IST

    Sara Ali Khan

    Follow us on

    Sara Ali Khan: హీరోయిన్స్ కి అందమే పెట్టుబడి. ఒకప్పుడు అందం అంటే చక్కని కళ్ళు, ముక్కు, ముఖం, రంగు మాత్రమే చూసేవారు. ఈ జనరేషన్ లో అందానికి కొన్ని లెక్కలు ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్స్ జీరో సైజ్ ప్యాక్ మైంటైన్ చేయాలి. అంగాంగ సుందరంగా మారాలి. అందుకు వర్క్ అవుట్ సరైన మార్గం. వయసుతో సంబంధం లేకుండా హీరోయిన్స్ జిమ్స్ లో కష్టపడుతున్నారు. వర్క్ అవుట్ చేయని హీరోయిన్ అంటే లేదంటే అతిశయోక్తి కాదు.

    ఇక బాలీవుడ్ భామలైతే ఈ విషయంలో మరింత సీరియస్. ఫిట్నెస్ ఫ్రీక్ గా సారా అలీ ఖాన్ పేరు తెచ్చుకుంది. నటుడు సైఫ్ అలీ ఖాన్ కూతురైన సారా అలీ ఖాన్ టీనేజ్ లో ఊబకాయంతో ఉండేది. ఆమె హీరోయిన్ అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. పట్టుదలతో బరువు తగ్గింది. సన్నబడ్డాక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యింది. సారా అలీ ఖాన్ నటించిన కొన్ని చిత్రాలు హిట్ అయ్యాయి.

    ఇక సారా దిన చర్యలు జిమ్ అనేది తప్పనిసరి. రెగ్యులర్ గా జిమ్ చేస్తారు. ఆహార నియమాలు పాటిస్తుంది. అందుకే ఆమె బరువు అదుపులో ఉంటుంది. మరో స్టార్ కిడ్ అనన్య పాండే. నటుడు చంకీ పాండే కూతురైన అనన్య పాండే హీరోయిన్ గా రాణిస్తుంది. సహజంగానే అనన్య చాలా సన్నగా ఉంటుంది. అందుకు ఆమె విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. అయినా కొన్ని పార్ట్స్ షేప్స్ సాధించేందుకు అనన్య జిమ్ చేస్తుంది.

    లైగర్ మూవీతో అనన్య తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండకు జంటగా గ్లామర్ ఒలకబోసింది. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లైగర్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. లైగర్ విజయం సాధిస్తే టాలీవుడ్ లో అమ్మడుకి ఆఫర్స్ దక్కేవి. కాగా సారా అలీ ఖాన్, అనన్య కలిసి వర్క్ అవుట్ చేస్తున్న వీడియో వైరల్ అవుతుంది. జిమ్ ఫిట్ లో చెమటలు పట్టిస్తున్న ఈ భామలు సూపర్ హాట్ గా ఉన్నారు.