RRR Movie Box Office Collection: దర్శక ధీరుడు రాజమౌళి ఇద్దరు స్టార్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్‌ను పెట్టి తీసిన ఆర్ ఆర్ ఆర్ ఇప్పటికీ దుమ్ములేపుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచానాలతో వచ్చిన ఈ మూవీ హై ఓల్టేజ్ సీన్లతో సంచలన విజయం నమోదు చేసిది. నార్త్ టు సౌత్ దాకా ఎక్కడ చూసినా రికార్డుల సునామీ సృష్టిస్తోంది. రిలీజ్ అయి 23రోజులు అవుతున్నా కూడా ఇంకా థియేటర్లకు జనాలు క్యూ కడుతూనే ఉన్నారు.

ఇక కేజీఎఫ్-2 లాంటి భారీ పాన్ ఇండియా మూవీ వచ్చినా.. ఈ మూవీపై పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఈ మూవీ జోనర్ ముందు కేజీఎఫ్ ఎఫెక్ట్ పెద్దగా పడలేదు. ఇకపోతే ఈ మూవీ 23వ రోజు కూడా మైండ్ బ్లోయింగ్ కలెక్షన్లతో దుమ్ములేపింది. దీంతో భారీ లాభాలు వచ్చిపడుతున్నాయి. వాస్తవానికి ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ప్రీరిలీజ్ బిజినెస్‌ను రూ.191 కోట్లుగా నమోదు చేసింది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ.451 కోట్ల బిజినెస్ జరుపుకుంది. అయితే 23వ రోజు నైజాంలో రూ. 31 లక్షలతో టాప్ కలెక్షన్లు వచ్చాయి. ఇక దాని తర్వాత సీడెడ్‌లో రూ. 12 లక్షలు అలాగే ఉత్తరాంధ్రలో రూ.8 లక్షలతో ఇలా అన్ని ప్రాంతాల్లో మంచి కలెక్షన్లను వసూలు చేసింది ఈ మూవీ. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీకి 23వరోజు రూ.67 లక్షల షేర్ తో పాటుగా రూ.1.05 కోట్లు గ్రాస్ వచ్చింది.

ఇక మొత్తంగా 23రోజుల్లో కలిపి తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి రూ.262.58 కోట్ల షేర్ రావడంతో పాటు.. రూ.396.05 కోట్ల గ్రాస్ రాబట్టింది. అటు ప్రపంచ వ్యాప్తంగా రూ. 581.69 కోట్లు షేర్ తో పాటు రూ.1,071 కోట్ల గ్రాస్ నమోదు చేసింది ఈ మూవీ. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 451 కోట్లు. అంటే 128.69 కోట్ల లాభాలు వచ్చాయన్నమాట. ఎంతైనా రాజమౌళి సినిమా అంటే ఇలాగే ఉంటుంది మరి.
Also Read:Chiranjeevi Acharya Pre Release Event: ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధి ఎవరో తెలుసా?
[…] SS Rajamouli: #RRR సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యం లో సాగే ఈ సినిమా స్క్రిప్ట్ ఇంకా మొదలు కానప్పటికీ వచ్చే ఏడాది సమ్మర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాము అని రాజమౌళి ఇటీవల జరిగిన కొన్ని ఇంటర్వూస్ లో తెలిపాడు..ఇప్పటికే యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యం లో రెండు స్టోరీ లైన్లు అనుకున్నాము అని..అవి ఇటీవలే మహేష్ ని కలిసి వివరించగా ఆయనకీ ఎంతో అద్భుతంగా అనిపించాయి అని..రెండిట్లో ఏ స్టోరీ లైన్ తీసుకున్నా నాకు పర్లేదు అని మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని..త్వరలోనే వీటిని డెవలప్ చేసి ఎదో ఒక్క స్టోరీలైన్ ని ఫిక్స్ చేసి స్క్రిప్ట్ ని రాయడం ప్రారంభిస్తాము అని స్వయంగా రాజమౌళి ఒక్క ఇంటర్వ్యూ లో తెలిపాడు..ఈ ఏడాది చివరి లోగ స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసి వచ్చే ఏడాది నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాడు అట రాజమౌళి. […]
[…] Pawan Kalyan New Movie: టాలీవుడ్ లో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఊపు ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..2018 వ సంవత్సరం లో విడుదల అయిన అజ్ఞాతవాసి సినిమా తర్వాత ఆయన చేస్తున్న మూడేళ్ళ సుదీర్ఘ విరామం తీసుకొని ఆయన చేసిన వకీల్ సాబ్ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం ఆడుతున్న సమయం లో కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించి పవన్ కళ్యాణ్ స్టామినా ఎలాంటిదో మరోసారి అందరికి అర్థం అయ్యేలా చేసింది..ఈ సినిమా తర్వాత ఆయన చేసిన భీమ్లా నాయక్ సినిమా కూడా అతి తక్కువ టికెట్ రేట్స్ తో విడుదల అయ్యి 100 కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టి సరికొత్త ప్రభంజనం సృష్టించింది..ఇప్పుడు ఆయన ప్రముఖ దర్శకుడు క్రిష్ తో హరిహర వీర మల్లు సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ఆయన గబ్బర్ సింగ్ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ తో ఒక్క భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా చెయ్యబోతున్నాడు..ఈ రెండు సినిమాల తర్వాత ఆయన చెయ్యబొయ్యే సినిమాల మీద ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద చర్చ నడుస్తుంది. […]