BB Jodi 2 Grand Finale Controversy: ‘బిగ్ బాస్ 9’ తర్వాత స్టార్ మా ఛానల్ లో ఎంతో గ్రాండ్ మొదలైన డ్యాన్స్ రియాలిటీ ‘BB జోడి 2’. బిగ్ బాస్ రియాలిటీ షోలో ఇప్పటి వరకు పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరినీ ఒక చోట చేర్చి, వాళ్ళని జోడీలుగా ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షోకి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీఆర్ఫీ రేటింగ్స్ కూడా బ్లాస్ట్ అయ్యాయి. రీసెంట్ గానే ఈ రియాలిటీ షో కి సంబంధించిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. ఈ సీజన్ ని గమనిస్తున్న ప్రతీ ఒక్కరు చెప్పేది ఏంటంటే, టైటిల్ విన్నర్ అనేది అమర్ దీప్ – నైనికా , మానస్ – శ్రేష్టి వర్మ లలోనే ఎవరో ఒకరు ఉంటారని అనుకునేవారు. వీళ్లిద్దరి డ్యాన్స్ పెర్ఫార్మన్స్ చూస్తే ఎవరికైనా అదే అనిపిస్తుంది.
Also Read: ప్రియుడి కోసం ఏకంగా తల్లినే.. వామ్మో ఇటువంటి కూతురు పుట్టనే కూడదు
అందరూ ఊహించినట్టే వీళ్ళిద్దరిలో ఒకరైనటువంటి మానస్ – శ్రేష్టి వర్మ జంట టైటిల్ గెలిచింది. వీళ్ళు విన్నర్ అయితే కచ్చితంగా రన్నర్ అమర్ దీప్ – నైనికా జంట అయ్యుంటుందని అనుకుంటే పెద్ద పొరపాటే. వీళ్ళు రన్నర్ స్థానం లో కూడా నిలబడలేదు, మూడవ స్థానం లో నిల్చినట్టు తెలుస్తోంది. ఇది తెలుసుకున్న అభిమానులు, కచ్చితంగా అమర్ దీప్ , నైనికా విషయం లో అన్యాయం జరిగిందని అంటున్నారు. ఎందుకంటే ఈమధ్య జరిగినకొన్ని ఎపిసోడ్స్ లో ఈ జంటకు జడ్జీలు ఉద్దేశపూర్వకంగానే మార్కులు తగ్గించినట్టుగా అనిపించింది. షో ఆరంభం లో వీళ్లిద్దరు డ్యాన్స్ పరంగా సెట్ చేసిన బెంచ్ మార్క్స్ ఎలాంటివో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ రేంజ్ లో డ్యాన్స్ వెయ్యకపోతే వీళ్ళు మార్కులు బాగా తగ్గించేస్తున్నారు. సదరు ఎపిసోడ్ లో అందరికంటే బాగా డ్యాన్స్ వేసినప్పటికీ కూడా మార్కులు తగ్గించడం వంటివి చాలా సార్లు జరిగింది.
గత ఎపిసోడ్ లో సాంగ్ మొత్తం ఎనర్జీ డ్రాప్ అవ్వకుండా నాన్ స్టాప్ గా వేసినప్పటికీ కూడా , మీ రేంజ్ ఎనర్జీ లేదని కామెంట్స్ చేసి మార్కులు బాగా తగ్గించేశారు. వీళ్ళకంటే తక్కువ డ్యాన్స్ వేసిన వాళ్లకు మాత్రం ఎక్కువ మార్కులు ఇచ్చారు. ఇదే ఈ షో ని చూస్తున్న వారికి అన్యాయం అనిపించింది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలు కూడా విడుదల చేశారు. ఆ ప్రోమో లో అమర్ దీప్ ఏ రేంజ్ లో డ్యాన్స్ వేశాడో అందరూ చూసారు. కానీ చివరికి మూడవ స్థానం లో ఈ జంట నిలబడడం అనేది అసలు అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అనుకుంటున్నారు. కచ్చితంగా జడ్జీల నుండి అన్యాయపూరితమైన మార్కులు వచ్చాయని, టాలెంట్ ని తొక్కేస్తున్నారంటూ నెటిజెన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
