spot_img
Homeఎంటర్టైన్మెంట్Harish Shankar: హరీష్ శంకర్ అహంకారం.. నిర్మాతకు నష్టం.. 'ఉస్తాద్ భగత్ సింగ్' కొంప ముంచింది..

Harish Shankar: హరీష్ శంకర్ అహంకారం.. నిర్మాతకు నష్టం.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కొంప ముంచింది..

Harish Shankar: చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఎలాంటి ప్రయోజనం లేదు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి వంటి సామెతలు పెద్దలు ఊరికే చెప్పలేదు. వాళ్ళ జీవిత అనుభవాల ఆధారంగా చేసుకొని ఇలాంటివి చెప్తూ ఉంటారు. అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు చూసిన తర్వాత పెద్దలు చెప్పే ఇలాంటి సంఘటనలు గుర్తొచ్చి నిజమే కదా అనిపిస్తూ ఉంటుంది. రీసెంట్ గా విడుదలైన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రానికి ఈ సామెతలు సరిగ్గా సూట్ అవుతాయి. ఈ సినిమాని ప్రకటించిన కొత్తల్లో సౌత్ ఇండియా లోనే మోస్ట్ క్రేజీ చిత్రాల్లో ఒకటిగా నిల్చింది. అప్పట్లో ఈ చిత్రం నుండి ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యేది. ఎక్కడ చూసినా ఈ చిత్రం గురించే చర్చ నడిచేది. అలాంటి క్రేజ్ ఉన్న సమయం లో ఈ సినిమా పై తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘తేరి’ కి రీమేక్ అంటూ ప్రచారం జరిగింది.

ఈ ప్రచారం తో అభిమానుల ఆవేశం కట్టలు తెచ్చుకుంది. ఇంత పెద్ద ప్రెస్టీజియస్ కాంబినేషన్ కి తేరి సినిమా రీమేక్ స్టోరీ ని ఎంచుకుంటారా అంటూ పెద్ద ఎత్తున పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సమయం లోనే ఈ సినిమాపై ఉన్న క్రేజ్ సగానికి పైగా పడిపోయింది. అప్పట్లో హరీష్ శంకర్ ఇది రీమేక్ కాదని అప్పట్లో ఆయన నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు. ఇదే విషయాన్నీ ఒక ఇంటర్వ్యూ లో విలేఖరి అడగ్గా , అందుకు హరీష్ శంకర్ సమాధానం చెప్తూ ‘వాస్తవానికి సోషల్ మీడియా లో జరుపుతున్న ఈ ప్రచారానికి నేను సమాధానం చెప్పేవాడిని. కానీ అభిమానులు ఆ రోజు చాలా ఓవర్ యాక్షన్ చేశారు. అందుకే చెప్పకూడదు అని అనుకుంటున్నాను. కంటెంట్ విడుదల చేస్తున్నాను కదా, వాళ్ళకే మా కంటెంట్ ని చూసిన తర్వాత అర్థం అయ్యిది. అప్పటి వరకు ఏమి మాట్లాడను’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక అప్పటి నుండి ఇది తేరి కి రీమేక్ అంటూ సోషల్ మీడియా అంతటా పెద్ద ప్రచారం సాగింది. ఇది సినిమాకు చేసిన డ్యామేజ్ అంత ఇంతా కాదు. విడుదలకు ముందు అభిమానులు కూడా ఇది రీమేక్ కాదంటూ చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. రీసెంట్ గా జరిగిన ఇంట్వ్యూస్ లో హరీష్ శంకర్ ఇది రీమేక్ కాదని పదే పదే చెప్తూ వచ్చాడు. కానీ నమ్మే పరిస్థితి లేదు. విచిత్రం ఏమిటంటే సినిమాని చూసిన కొంతమంది టాప్ మోస్ట్ రివ్యూయర్లు కూడా ‘తేరి’ తో పోల్చి చూస్తున్నారు. ఇంత ప్రచారం జరిగిన తర్వాత మూవీ లవర్స్ ఈ చిత్రానికి ఎలా వెళ్తారు చెప్పండి. అందుకే పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలచింది. అభిమానుల పట్ల ఆరంభం లో హరీష్ శంకర్ అంతటి అహంకారం చూపించకుండా, రూమర్స్ వచ్చినప్పుడే కొట్టి పారేసి ఉండుంటే నేడు ఈ సినిమాకు ఇలాంటి ఫలితం దక్కి ఉండేది కాదని అంటున్నారు విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version