మెగా ఫ్యామిలీ నుంచి మరో వారసుడు వచ్చాడు. ఇప్పటికే ఎక్కువ మంది అయిపోయారని అనుకుంటున్న వేళ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మేనమామ కొడుకు విరాన్ ముత్తంశెట్టి హీరోగా ‘బతుకు బస్టాండ్’ అనే సినిమా రెడీ అవుతుతోంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
ఐఎన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిఖిత అరోరా-శృతిశెట్టి-జెన్నిఫర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చక్రధర్ రెడ్డి సమర్పణలో ఇలవల ఫిలిమ్స్ బ్యానర్ పై ఐ కవితారెడ్డి -కే.మాధవి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సినిమా టైటిల్ విభన్నంగా ఉంది. హీరో పాత్రకూడా అంతే డిఫెరెంట్ గా ప్లాన్ చేశారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి అటు సాధారణ ప్రేక్షకులతోపాటు ఇటు ఇండస్ట్రీ సర్కిల్స్ లో కూడా ఈ చిత్రంపై భారీ అంచాలు వచ్చాయి..
సినిమా ట్రైలర్ చూస్తే ఒక లక్ష్యం అంటూ లేకుండా తిరుగుతున్న తిరుగుబోతు అబ్బాయి ఒక అమ్మాయి పరిచయంతో ఎలా మారాడు. అతడికి వచ్చిన ఇబ్బందులు ఏమిటన్నది సస్పెన్స్ థ్రిల్లర్ గా చూపించారు.
విరాన్ తన తొలి సినిమాలోనే తనలోని రోమాంటిక్, మాస్ యాంగిల్ ను బయటపెట్టాడు. హీరో ఎవరి కోసమో వెతుకుతూ పరిగెత్తడం.. విలన్స్ తో పోరాడడం చూస్తుంటే ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ గా అనిపిస్తోంది.