
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతాన్ని ప్రభుత్వం పూర్తిగా అభివృద్ధి చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఇప్పటికే అనేక సంస్థలు తమ కార్యకలాపాల కోసం స్థలాలు తీసుకున్నాయని వాటిని ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గుంటూరు జిల్లా తాళ్లయపాలెం నుంచి రాష్ట్రంలో ఉన్న ఆలయాలను సందర్శించాలనే కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఆయన అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ఏటా తప్పనిసరిగా కౌలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.