
ఆర్చరీ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ లో భారత్ పోరు ముగిసింది. క్వార్టర్ ఫైనల్ లో భారత్ ఓటమి పాలైంది. 2-6 తేడాతో దక్షిణ కొరియా చేతిలో భారత జోడీ దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్ ఓడిపోయారు. ప్రీ క్వార్టర్ ఫైనల్ లో చైనీస్ తైపీపై 5-3 తేడాతో దీపకా కుమారి, ప్రవీణ్ జాదవ్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రీ క్వార్టర్ ఫైనల్ లో లిన్ చియా ఎన్, తంగ్ చిచ్ చూన్ ను దీపికా కుమారి, జాదవ్ కలిసి ఓడించారు.