Barrelakka On Bigg Boss: బిగ్ బాస్ షోలో అడుగుపెడుతున్న బర్రెలక్క… ఇక రచ్చ రచ్చే!

ఓటిటీ సీజన్ 2 కోసం మేకర్స్ కంటెస్టెంట్స్ వేటలో ఉన్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొందరి పేర్లు బాగా వినిపిస్తున్నాయి.ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 7 లో పాపులర్ అయినా కంటెస్టెంట్స్ ని ఓటిటీ కి తీసుకుంటున్నట్లు సమాచారం.

Written By: NARESH, Updated On : December 29, 2023 1:08 pm

Barrelakka On Bigg Boss

Follow us on

Barrelakka On Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 7 ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. గత సీజన్ తో పోలిస్తే ఇది మంచి టీఆర్పీ సాధించి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీంతో నిర్వాహకులు బిగ్ బాస్ ఓటిటీ సీజన్ 2 కోసం ప్లాన్ చేస్తున్నట్లు న్యూస్ బయటకు వచ్చింది. దీంతో బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 2లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ కి సంబంధించిన కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. 2022 ఫిబ్రవరి లో మొదటిసారి బిగ్ బాస్ ఓటిటీ 24/7 నాన్ స్టాప్ ను ప్రారంభించారు. దానికి రెస్పాన్స్ బానే వచ్చింది. ఆ సీజన్ విన్నర్ గా నటి బిందు మాధవి నిలిచారు.

దీంతో ఓటిటీ సీజన్ 2 కోసం మేకర్స్ కంటెస్టెంట్స్ వేటలో ఉన్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొందరి పేర్లు బాగా వినిపిస్తున్నాయి.ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 7 లో పాపులర్ అయినా కంటెస్టెంట్స్ ని ఓటిటీ కి తీసుకుంటున్నట్లు సమాచారం. స్పై బ్యాచ్ కు మద్దతుగా నిలిచిన భోలే షావలి, నయని పావనిని తీసుకుంటున్నారట. వీళ్లిద్దరు సీజన్ 7 లో మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా నయని, భోలే కి సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ ఏర్పడింది. దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారట మేకర్స్.

ఆదే విధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బర్రెలక్క కి కూడా ఓటీటీలో అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసింది. యూత్ లో మంచి క్రేజ్ సంపాదించింది బర్రెలక్క. బిగ్ బాస్ ఓటిటీ కోసం ఆమెను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు జీ తెలుగు లో వచ్చిన సరిగమప షో ద్వారా పాపులర్ అయిన సింగర్ పార్వతిని కూడా బిగ్ బాస్నిర్వాహకులు కలిసారట.

యూట్యూబ్ లో నవాబ్ కిచెన్ పేరుతో బాగా ఫేమస్ అయిన మోహన్ భాయ్ ని కూడా బిగ్ బాస్ టీం అప్రోచ్ అయ్యారట. ఇక బిగ్ బాస్ ఓటిటీ 2024 ఫిబ్రవరి లో ప్రారంభం కానుందని టాక్ వినిపిస్తుంది. అయితే ఓటిటీ సీజన్ 2 కూడా హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నట్లు సమాచారం. నటుడు భద్రం, రిచా పనయ్, సోనియా దీప్తి వంటి సెలెబ్స్ పేర్లు వినిపిస్తున్నాయి.