Bangarraju: కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. నాగ్ – కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్ గా ఈ మూవీ రానుంది. సోగ్గాడే చిన్ని నాయన నాగ్ కెరీర్ లో ఒక మైలు రాయిగా నిలిచింది.
Bangarraju
అలాగే ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తుండగా.. నాగచైతన్య సరసన కృతి శెట్టి సందడి చేయనుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న బంగార్రాజు సినిమా కూడా అదే రేంజ్ లో ఉండబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
Also Read: టాలీవుడ్ స్టార్స్ అందరూ ట్యూషన్ లో చేరండయ్యా..!
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ అదిరిపోయే సాంగ్ టీజరను విడుదల చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఈటీజర్ సోషల్మీడియాలో దూసుకెళ్లిపోతోతంది. ఈ పాటలో నాగార్జున, నాగచైతన్య కలిసి జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా తో స్టెప్పులేస్తూ కనిపిస్తున్నారు. “ఓల ఓలమ్మో.. ఈ బుల్లోడు వచ్చాడు.. ఓ సైక చేస్తాడు.. ముద్దొస్తున్నాడు “ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఇక ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ సినిమా పై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read: సమంతతో చైతన్య విడిపోడానికి కారణం ఇదేనా?.. వైరల్గా చై రీసెంట్ ఇంటర్వ్యూ
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Bangarraju movie special song released
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com