Pushpa Movie Twitter Reviews: భారీ అంచనాల నడుమ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ మూవీ రిలీజ్ అయ్యింది. ఇప్పటికే ఓవర్సీస్ లో అమెరికాలో ‘పుష్ప’ షోలు పడ్డాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలో ఈ ఉదయం షోలు పడుతున్నాయి. తెలంగాణలో 5 షోలకు అనుమతి ఇవ్వడంతో ఉదయమే ఈ సినిమా బెనిఫిట్ షోలు పడ్డాయి. ఆంధ్రాలోనూ కొన్ని చోట్ల పడ్డాయని అంటున్నారు. ఈ క్రమంలోనే ‘పుష్ప’ మూవీ టాక్ బయటకు వచ్చింది. ట్విట్టర్ వేదికగా అభిమానులు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ‘వన్ మ్యాన్’ షో చేశాడని మెజార్టీ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. యాక్షన్ సీన్లు గూస్ బాంబ్స్ తెప్పిస్తాయని అంటున్నారు. విలన్ గా ఫహద్ ఫాజిల్, సునీల్ అదరగొట్టారని టాక్ వినిపిస్తోంది.
https://twitter.com/BunnyYouthIcon/status/1470242144661098496?s=20
https://twitter.com/raghava_rohit/status/1471610410189168647?s=20
అల్లు అర్జున్ ఈ సినిమాలో ఇరగదీశాడని కొనియాడుతున్నారు. ఇంకొంత మంది అయితే ఈ సినిమా ఓ రేంజ్ లో ఉందని అంటున్నారు. అల్లు అర్జున్ పుష్పగా జీవించాడని.. టైటిల్ రోల్ లో నభూతో అన్నట్టుగా చేశాడని అంటున్నారు.
Pushpa one word review: Outstanding.
Allu Arjun best ever performance till date,,
full mass entertainer….
Racy first half with intense second half…
Direction, Music, BGM, DOP top class..
Good end to wait for THE RULEEEE……#Pushpareview #PushpaUSAPremiereOnDec16 #Pushpa— Siva kumar (@sivagvs) December 17, 2021
Also Read: అల్లు అర్జున్ “పుష్ప” సెకండ్ పార్ట్ టైటిల్ లీక్… సోషల్ మీడియాలో వైరల్
మొత్తంగా ‘అఖండ’ టాలీవుడ్ కు వచ్చిన ఊపు ‘పుష్ప’తో రెట్టింపు అయ్యిందని.. మరో గ్రాండ్ సక్సెస్ వచ్చిందని టాక్ వినపడుతోంది.
https://twitter.com/Cinee_Worldd/status/1471637846289223686?s=20
ట్విట్టర్ వేదికగా అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమా బాగుందని ఓవరాల్ గా చెబుతున్నారు. అల్లు అర్జున్, రష్మీక, అనసూయ, సునీల్, ఫహద్ ఫాజిల్ వంటి నటీనటులు కూడా ఈ సినిమా సక్సెస్ లో కీరోల్ పోషించారని చెబుతున్నారు.
https://twitter.com/B4Politics/status/1471637985514905607?s=20
Also Read: అల్లు అర్జున్ “పుష్ప” సినిమా రివ్యూ… బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల లో తగ్గేదే లే