Lord Hanuman: ఆంజనేయుడిని పెళ్లయిన బ్రహ్మచారి అని ఎందుకు పిలుస్తారు.. అతను వివాహం ఎవరిని చేసుకున్నారు?

Lord Hanuman: హిందూ దేవుళ్లలలోఎంతో ప్రసిద్ధి చెందిన దేవుడిగా చాలామంది హనుమంతుడిని పూజిస్తారు. ఈ విధంగా ఆంజనేయస్వామిని పూజిస్తూ చాలామంది అతను బ్రహ్మచారి అని భావిస్తారు. నిజానికి ఆంజనేయ స్వామి కి కూడా వివాహం జరిగింది. వివాహం జరిగిన ఆంజనేయ స్వామిని ఎందుకు బ్రహ్మచారి అంటారు. అసలు ఆంజనేయ స్వామి ఎవరిని పెళ్లి చేసుకున్నారు? అతని భార్య ఎవరు అనే విషయాల గురించి తెలుసుకుందాం… Also Read: శ్రీశైల భ్రమరాంబికకు.. చత్రపతి శివాజీకి మధ్య ఉన్న అనుబంధం […]

Written By: Kusuma Aggunna, Updated On : December 2, 2021 11:51 am
Follow us on

Lord Hanuman: హిందూ దేవుళ్లలలోఎంతో ప్రసిద్ధి చెందిన దేవుడిగా చాలామంది హనుమంతుడిని పూజిస్తారు. ఈ విధంగా ఆంజనేయస్వామిని పూజిస్తూ చాలామంది అతను బ్రహ్మచారి అని భావిస్తారు. నిజానికి ఆంజనేయ స్వామి కి కూడా వివాహం జరిగింది. వివాహం జరిగిన ఆంజనేయ స్వామిని ఎందుకు బ్రహ్మచారి అంటారు. అసలు ఆంజనేయ స్వామి ఎవరిని పెళ్లి చేసుకున్నారు? అతని భార్య ఎవరు అనే విషయాల గురించి తెలుసుకుందాం…

Lord Hanuman

Also Read: శ్రీశైల భ్రమరాంబికకు.. చత్రపతి శివాజీకి మధ్య ఉన్న అనుబంధం గురించి మీకు తెలుసా?

ఆంజనేయ స్వామి తన గురువు సూర్య దేవుడి దగ్గర అన్ని విద్యలను నేర్చుకున్నారు. ఇక ఆయన నేర్చుకోవాల్సింది కేవలం ఒకే ఒక విద్య మాత్రమే మిగిలి ఉంది.అయితే ఆ విద్యను కూడా నేర్చుకోవాలంటే తప్పనిసరిగా అతనికి వివాహం జరిగి ఉండాలి.ఈ క్రమంలోనే సూర్య దేవుడు తనకు ఆ విద్యను నేర్పించాలి లేక పోయానని బాధపడుతున్న సమయంలో ఆంజనేయుడిని పిలిచి నీవు ఈ విద్య నేర్చుకోవాలంటే తప్పకుండా వివాహం చేసుకోవాలి. కనుక నా కూతురిని వివాహం చేసుకొని ఈ విద్యను నేర్చుకో కానీ వివాహం తర్వాత నువ్వు గృహస్థుడు కాకుండా ఉండాలి.నా కూతురు వివాహం అయిన మరుసటి క్షణమే తపస్సు కోసం అరణ్యాలకు వెళ్తుంది అని హితబోధ చేశాడు.

ఆ మాట విన్న ఆంజనేయుడు సూర్య పుత్రిక అయిన సువ‌ర్చ‌ల‌ను పెళ్లి చేసుకుంటాడు పెళ్లి అనంతరం సువ‌ర్చ‌ల‌ తపస్సు కోసం అరణ్యాలకు వెళుతుంది. ఆంజనేయస్వామి మిగిలిన ఆ విద్యను కూడా నేర్చుకున్నారు కానీ అతను మాత్రం వివాహం తరువాత
ఏనాడూ గృహ‌స్థు కాలేదు కనుక ఆంజనేయస్వామికి పెళ్లి జరిగినప్పటికీ ఆయనను బ్రహ్మచారిగానే పూజిస్తారు.

Also Read: మూర్ఖులతో వాదిస్తున్నారా.. అయితే మీ సమయం వృధా.. ఎందుకంటే?